Home Film News Kota: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని టార్గెట్ చేసిన కోట‌.. మ‌రీ అంత దారుణంగా అన్నాడేంటి?
Film News

Kota: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని టార్గెట్ చేసిన కోట‌.. మ‌రీ అంత దారుణంగా అన్నాడేంటి?

Kota: టాలీవుడ్ లెజెండ్స్‌లో కోట శ్రీనివాస‌రావు త‌ప్పక ఉంటారు. ఆయ‌న న‌ట‌న‌ ప్రతిభ గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. వందల చిత్రాల్లో అద్భుతమైన నటనతో అల‌రించిన‌ కోట శ్రీనివాసరావు వయసు రీత్యా సినిమాలు తగ్గించారు.కాకపోతే పలు సందర్భాలలో కోట శ్రీవాసరావు చేస్తున్న కామెంట్స్ మాత్రం హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆయ‌న చేసే కాంట్ర‌వ‌ర్షియ‌ల్ కామెంట్స్ తో తీవ్ర విమ‌ర్శ‌ల బారిన ప‌డుతున్నాడు. తాజాగా ఆయ‌న త‌న‌కు న‌చ్చ‌ని విష‌యాల‌పై ఓపెన్‌గా కామెంట్స్ చేశాడు. ఓ ఈవెంట్‌లో పాల్గొన్న కోట‌ స్టార్ హీరోల‌పై సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు చేశారు. సీనియర్ ఎన్టీఆర్‌ మ‌ళ్లీ పుడితే త‌ప్ప ఆయ‌న‌లా మ‌రొక‌రు ఉండ‌రు అని కోట శ్రీనివాస‌రావు అన్నారు. అదే స‌మ‌యంలో ‘ఎన్టీఆర్-ఎఎన్నార్..శోభన్..కృష్ణ వీరు ఎవ‌రు కూడా ఏనాడూ తమ రెమ్యూనరేషన్ గురించి బాహాటంగా చెప్ప‌లేదు అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఇప్పుడు హీరోలు మాత్రం ఓపెన్‌గా నేను రోజుకు రెండు కోట్లు తీసుకుంటా అని చెప్పుకొస్తున్నారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాదు. అస‌లు ఈ రోజు సినిమా అనేది ఎక్కడ ఉంది.. అంతా సర్కస్ మాత్ర‌మే. విషాద గీతాలకు కూడా డ్యాన్స్ చేస్తుండ‌డం ఆశ్చర్య‌ప‌రుస్తుంది అని కోట తెలిపారు. బాత్ రూమ్ బ్రష్ నుంచి బంగారం ప్రకటన వరకు అన్నీ హీరోలు చేస్తుంటే మిగిలిన న‌టీన‌టులు ఎలా బ్ర‌త‌కుతారు అంటూ స్టార్స్‌ని గ‌ట్టిగానే అడిగాడు కోట‌. అయితే కోట శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్య‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని టార్గెట్ చేసే అన్నాడ‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు.

 

కొన్ని రోజుల‌ ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ ప‌బ్లిక్ మీటింగ్‌లో మాట్లాడుతూ త‌న‌పై వ‌చ్చే విమ‌ర్శ‌ల‌కి బ‌దులిస్తూ.. తాను రోజుకి రెండు కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాన‌ని అన్నాడు. ఇప్పుడు దానిని కోట త‌ప్పుబ‌ట్టిన‌ట్టు తెలుస్తుంది. కోట శ్రీనివాసరావు కామెంట్స్ పై హ‌ర్ట్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోటని విమర్శిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. నీ ప‌ని నువ్వు చూసుకోక ఈ గోలంత ఎందుకు నీకు అంటూ కొంద‌రు ఘాటుగానే విమ‌ర్శిస్తున్నారు. వాణిజ్య ప్రకటనలకి గాను కొన్ని సంస్థ‌లు స్టార్ హీరోలని ఎంపిక చేసుకుంటాయి. ఇందులో నీకు వచ్చిన నష్టం ఏంటి అని కోట‌ని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ వివాదం ఎంత ముందుకు వెళుతుందో చూడాలి.

 

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...