Home Film News Honey Rose: నా బాడీ గురించి ఆ క‌మెడీయ‌న్ చెత్తగా మాట్లాడి న‌వ్వుకున్నాడు..హ‌నీరోజ్ షాకింగ్ కామెంట్స్
Film News

Honey Rose: నా బాడీ గురించి ఆ క‌మెడీయ‌న్ చెత్తగా మాట్లాడి న‌వ్వుకున్నాడు..హ‌నీరోజ్ షాకింగ్ కామెంట్స్

Honey Rose: ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ని గెలుచుకున్న మాలీవుడ్ ముద్దుగుమ్మ హ‌నీరోజ్. చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యం ఈ ముద్దుగుమ్మ సొంతం.  2005 లో మాలీవుడ్ లో రిలీజ్ అయిన బాయ్ ఫ్రెండ్ మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హ‌నీరోజ్ తెలుగులో ఆలయం అనే సినిమాతో ప‌ల‌క‌రించింది. అనంత‌రం ఈ వర్షం సాక్షిగా లో నటించింది.. ఆ సినిమాలు పెద్దగా గుర్తింపు తీసుకు రాక‌పోవ‌డంతో కొన్నాళ్లు సైలెంట్ అయింది. ఇక ఇటీవ‌ల  బాలయ్యతో నటించిన ‘వీర సింహారెడ్డి’ మూవీలో న‌టించి  మంచి గుర్తింపు ద‌క్కించుకుంది. ఈ సినిమాతో హ‌నీరోజ్ పేరు తెలుగు రాష్ట్రాల‌లో మారుమ్రోగిపోతుంది. చిత్రంలో శృతి హాస‌న్ లాంటి స్టార్ హీరోయిన్ ఉన్నా కూడా హ‌నీ రోజ్ అంద‌రి దృష్టిని ఆకర్షించ‌డం గొప్ప విష‌య‌మే.

2009 సంవత్సరం నుంచి హాని రోజ్ అసలు సినీ కెరీర్ స్టార్ట్ అయ్యిందని చెప్పాలి. మొదట్లో ఆమె అవకాశాల కోసం పెద్దగా ప్రయత్నాలు చేయకుండా సొంత టాలెంట్‌తో త‌న‌ని తాను ప్రూవ్ చేసుకోవాల‌ని అనుకుంది. ప‌లు  షార్ట్ ఫిల్మ్‌లలో కూడా  నటించింది. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లలో హనీ నటనకు ప్రశంసలు ద‌క్కాయి. అనంత‌రం వెండితెరపై వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకుంది. అయితే హ‌నీరోజ్ ఇటీవ‌ల బాడీ షేమింగ్‌కి కూడా ఎక్కువ‌గా గుర‌వుతుంది. తాజాగా దీనిపై ఆమె మాట్లాడింది. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నాపై కుళ్లు జోకులు వేసుకొని నవ్వుకుంటారు. అయితే వారు నా ముందు మాత్రం అందంగా ఉన్నావంటూనే  పక్కకు వెళ్లి మాత్రం నా బాడీషేమింగ్ పై చెత్త‌ కామెంట్స్ చేసేవారు.

కొన్ని ట్రోల్స్  నా మనసు ఎంతగానో నొప్పిస్తుంటాయి. నా శరీరాకృతి గురించి కొంతమంది పిచ్చి కామెంట్స్ చేస్తుంటే ఎన్నోసార్లు బాధ‌ప‌డ్డాను. ప్ర‌స్తుతం వాటన్నింటిని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను  అని అన్నారు హనీ రోజ్.  ఇటీవ‌ల ఓ షోకి వెళ్ల‌గా, అది చూసేందుకు వచ్చిన ఒకతను నా బాడీ గురించి చాలా చెత్తగా మాట్లాడాడు. అయితే అతను అలా నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే ఆ షో యాంకర్ మాత్రం పగలబడి నవ్వుతుంది.యాంక‌ర్ కూడా ఓ మ‌హిళ‌నే. దానిని వ్యతిరేఖించాల్సింది పోయి న‌వ్వుతూ కూర్చుంది. ఓ క‌మెడీయ‌న్ కూడా   నా శరీర భాగాల గురించి చాలా చెత్త‌గా మాట్లాడాడు.. ఇలా బాడీ షేమింగ్ చేస్తూ మహిళలను అవ‌హేళన చేస్తుంటే.. వాటిని టీవీల్లో ప్రసారం ఎలా చేస్తారో అస‌లు అర్ధం కావ‌డం లేదంటూ హనీరోజ్ ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...