Home Film News Balayya: హిట్ ప్ర‌పంచంలోకి ఎంట‌ర్‌కానున్న బాల‌కృష్ణ‌.. ద‌ర్శ‌కుడి ప్లానింగ్ అదుర్స్..!
Film News

Balayya: హిట్ ప్ర‌పంచంలోకి ఎంట‌ర్‌కానున్న బాల‌కృష్ణ‌.. ద‌ర్శ‌కుడి ప్లానింగ్ అదుర్స్..!

Balayya: నటసింహం నందమూరి బాలకృష్ణ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. కుర్ర హీరోల‌కి పోటీగా వ‌రుస సినిమాలు చేస్తూ అల‌రిస్తున్నాడు. ఒక‌వైపు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ సినిమాల విష‌యంలో ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు.  గ‌త ఏడాది ‘అఖండ’ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చిన బాలయ్య.. ఆ ఫాంను ఈ ఏడాది కూడా  కొన‌సాగిస్తూ వీర‌సింహారెడ్డి అనే చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు. వ‌రుస విజ‌యాల‌తో మంచి జోష్ మీదున్న బాల‌య్య  ప్రస్తుతం కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.  బాలయ్య  108వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి  ‘భగవత్ కేసరి’ అనే టైటిల్ ఫైన‌ల్ చేసిన‌ట్టు ఫిలిం న‌గ‌ర్ టాక్. అయితే జూన్ 10న బాలయ్య బ‌ర్త్ డే సంద‌ర్భంగా దీనిపై క్లారిటీ రానుంది.

ఇక ఇదిలా ఉంటే బాల‌కృష్ణ త‌న బ‌ర్త్ డే రోజు అదిరిపోయే అనౌన్స్ మెంట్ ఇవ్వ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. హిట్ 4కి సంబంధించి అనౌన్స్‌మెంట్ ఒక‌టి రానుంద‌ని, అందులో బాల‌య్య ప‌వ‌ర్ ఫుల్ పాత్ర పోషించ‌బోతున్న‌ట్టు అనౌన్స్ చేయ‌నున్నార‌ని అంటున్నారు. హిట్ సినిమాల ఫ్రాంచైజీతో సూపర్ హిట్ కొట్టిన‌ డైరెక్టర శైలేష్ కొలను… హిట్ యూనివర్స్ పేరుతో వివిధ సినిమాలు తెరకెక్కిస్తానంటూ గ‌తంలో వెల్ల‌డించాడు. హిట్  యూనివర్స్ లో విశ్వక్ సేన్ తో హిట్ 1, అడవి శేష్ తో హిట్ 2 మూవీస్ రాగా, ఇవి రెండు మంచి హిట్ కొట్టాయి.. ఇక హిట్ 3 లోనాని క‌నిపించ‌నున్నాడు. ఇప్పుడు హిట్ 4లో   నందమూరి నటసింహం బాలకృష్ణ నటించ‌నున్నార‌ని చెబుతున్నారు.

టాలీవుడ్‌ సీనియర్‌ హీరో బాల‌కృష్ణ‌ని హిట్‌ సిరీస్‌లోకి లాగుతుండటం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇప్పటికే శైలేష్ కొలను.. బాలయ్యని క‌లిసి ఆయ‌న‌కి స్క్రిప్ట్ కూడా నెరేట్‌ చేశారు. ఆ క‌థ‌కి బాలయ్య పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారట. అయితే దీనిపై దర్శకుడికి ఇంకా ఎలాంటి సమాధానం ఇవ్వలేదని, జూన్ 10లోపు దీనిపై బాల‌య్య ఓ క్లారిటీ ఇవ్వ‌బోతున్నార‌ని అంటున్నారు.  ప్రస్తుతం శైలేష్‌.. మ‌రో సీనియ‌ర్ హీరో వెంకటేష్‌తో `సైంధవ్‌` అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ చిత్రం హిట్ అయితే మ‌నోడికి మ‌రిన్ని ఆఫర్స్ రావ‌డం ఖాయం.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...