Home Film News Celebrities: మళ్లీ కెమెరాకి చిక్కిన అదితి, సిద్ధార్థ్.. కెమెరాని చూడగానే ఉరుకులు, ప‌రుగులు..!
Film NewsGossips

Celebrities: మళ్లీ కెమెరాకి చిక్కిన అదితి, సిద్ధార్థ్.. కెమెరాని చూడగానే ఉరుకులు, ప‌రుగులు..!

Celebrities: ఇటీవ‌ల చాలామంది జంట‌లు సీక్రెట్‌గా ప్రేమాయ‌ణం న‌డుపుతున్నారు. వారి గురించి ఎలాంటి వార్త‌లు వ‌చ్చిన కూడా వాటిని కొట్టి ప‌డేస్తూ త‌మ ప‌ని తాము చేసుకుంటున్నారు. అలాంటి వారిలో సిద్ధార్థ్- అదితి జంట ఒక‌టి.  లవర్‌బాయ్‌ సిద్ధార్థ్‌, అదితిరావు హైదరీ ప్రేమలో ఉన్నట్లు గతకొంత కాలంగా జోరుగా ప్ర‌చారాలు న‌డుస్తున్నాయి.  రెండేళ్ల క్రితం వచ్చిన ‘మహాసముద్రం’ సినిమాలో జంట‌గా వీరిద్ద‌రు న‌టించారు. అప్పుడు వీరి మ‌ధ్య స్నేహం మొద‌లై అది ప్రేమ‌గా మారింద‌ని అంటున్నారు. అయితే వీళ్ల రిలేషన్‌పై ఎన్ని వార్త‌లు వ‌చ్చిన‌ ఈ జంట ఇప్పటివరకు స్పందించింది లేదు.  ఏదో ఒకటి చెప్పి సైలెంట్‌గా తప్పించుకుంటూ వస్తున్నారు.

ఇటీవ‌లి కాలంలో ఈ జంట పలు పార్టీలకు కలిసి వెళ్ళడం, టూర్స్ కి వెళ్ల‌డం చూసి జ‌నాలు  త్వరలోనే  వీరిపెళ్లి జ‌రుగుతుంది అని కూడా క‌న్ఫాం చేశారు. ఇటీవలే శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌కు క‌లిసి వ‌చ్చిన ఈ జంట నేడు జ‌ర‌గ‌నున్న పెళ్లికి కూడా క‌లిసి రానున్నార‌ని అంటున్నారు.తాజాగా అదితి, సిద్ధార్థ్‌ ముంబై ఎయిర్‌పోర్టులో జంటగా దర్శనమిచ్చారు. వీరికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌గా, ఇందులో సిద్ధార్థ్ ముఖానికి మాస్క్‌ ధరించి ఉన్నాడు. లగేజీ ట్రాలీని తోసుకుంటూ ఆయన చెకింగ్‌ దగ్గరకు స్పీడ్‌గా వెళ్లాడు.ఇక  వెనకాల అదితీ మెల్ల‌గా న‌డుచుకుంటూ వ‌స్తుండ‌గా, ఆమెని ఫొటోగ్రాఫ‌ర్స్ త‌మ కెమెరాల‌లో బంధించారు.

ఫొటోగ్రాఫర్ల దగ్గర అదితి నవ్వుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. అనంతరం చెకింగ్‌ దగ్గరకు వెళ్లిపోయింది. అయితే మీడియా నుండి త‌ప్పించుకొని స్పీడ్‌గా వెళ్లిపోయిన శ‌ర్వానంద్‌పై కొంద‌రు నెటిజ‌న్స్ ఫ‌న్నీ కామెంట్స్ చేస్తున్నారు.   మీడియాను చూస్తే సిద్ధార్థ్‌కు ఎందుకంత భయం అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీరిద్ద‌రు శ‌ర్వానంద్ పెళ్లికి బ‌య‌లు దేరి ఉంటార‌ని కొంద‌రు చెబుతున్నారు. సిద్ధార్థ్ ఇప్ప‌టికే ప‌లువురితో ప్రేమాయ‌ణం న‌డిపించి ఇప్పుడు అదితి ద‌గ్గ‌ర వ‌రకు వ‌చ్చాడు. మ‌రి ఈమెతో అయిన ఎక్కువ కాలం రిలేష‌న్ మెయింటైన్ చేస్తాడా లేదా అనేది చూడాలి.

Related Articles

ఇప్పటికీ జక్కన్న నాకు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.. తమన్నాసెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

మిల్కీ బ్యూటీ తమన్నా చిత్ర పరిశ్రమలో ఈ పేరుకి ఎలాంటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో...

1000 కోట్లు ఇచ్చినా సరే అలా చేయను అంటూ తెగేసి చెప్పేస్తున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..!?

ప్రస్తుతం ఇండియన్ సినిమా చిత్ర పరిశ్రమలో భారీ స్టార్‌డంతో దూసుకుపోతున్న ప్రభాస్ పెళ్లి వయసు దాటుతున్న...

మహేష్ కోసం అవతార్ డైరెక్టర్ ను తీసుకొస్తున్న రాజమౌళి.. జక్కన్న స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే అధికార...

రామ్ చరణ్ ఫోన్ లో ఎన్టీఆర్ నెంబర్ ఏమని ఉంటుందో తెలుసా.. భ‌లే సిల్లిగా లేదు..!

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ టాలీవుడ్ లో అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా...