Home Film News అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా సందీప్ కిష‌న్ ఎలా ఎదిగాడు..అత‌న‌కి ఉన్న‌ సైడ్ బిజినెస్‌ల గురించి తెలుసా?
Film NewsSpecial Looks

అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా సందీప్ కిష‌న్ ఎలా ఎదిగాడు..అత‌న‌కి ఉన్న‌ సైడ్ బిజినెస్‌ల గురించి తెలుసా?

టాలీవుడ్ లో ఉన్న ట్యాలెంటెడ్ హీరోల్లో సందీప్ కిష‌న్ ఒక‌డు. 2013లో వ‌చ్చిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీతో తెలుగు వారికి సందీప్ కిష‌న్ చేరువ‌య్యాడు. ఆ త‌ర్వాత గ్యాప్ లేకుండా వ‌రుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు. తెలుగుతో పాటు త‌మిళ్‌, హిందీ ఇండ‌స్ట్రీల్లో నూ ప‌ని చేస్తూ బహుభాషా నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే హీరో పాత్ర‌ల‌కే ప‌రిమితం అవ్వ‌కుండా బ‌ల‌మైన స‌హాయ‌క పాత్ర‌ల‌ను పోషించేందుకు కూడా మొగ్గు చూపుతున్నాడు. అయితే సందీప్ కిష‌న్ న‌టుడిగా అంద‌రికీ సుప‌రిచిత‌మే. కానీ, అత‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌దు. ఈ నేప‌థ్యంలోనే సందీప్ కిష‌న్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..? అత‌ని త‌ల్లిదండ్రులు ఎవ‌రు..? అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా ఎలా ఎదిగాడు..? సందీప్ కి ఉన్న సైడ్ బిజినెస్‌లు ఏంటి..? వంటి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Sandeep Kishan : సందీప్ కిషన్ వల్ల ఇంత మంది స్టార్ హీరోల కెరీర్లు బాగుపడ్డాయా..! ఎవరికీ తెలియని షాకింగ్ నిజం! | Telugu Cinema Today News and Updates

1987 మే 7న చెన్నైలో ఓ తెలుగు కుటుంబంలో సందీప్ కిష‌న్ జ‌న్మించాడు. తండ్రి పి.ఆర్‌.పి. నాయుడు వ్యాపార‌వేత్త కాగా.. త‌ల్లి ఆర్‌.కె. దుర్గ ఆల్ ఇండియా రేడియోలో వ‌ర్క్ చేసేవారు. సందీప్ కిష‌న్‌కు మౌనిక అనే సోద‌రి ఉంది. సినిమాటోగ్రాఫర్‌ చోటా కె. నాయుడు మరియు శ్యామ్ కె. నాయుడులకు అత‌ను స్వ‌యానా మేనల్లుడు. చెన్నైలోని లయోలా కాలేజీ నుండి సందీప్ కిష‌న్ గ్రాడ్యుయేట్ అయ్యాడు. చిన్నప్పటి నుంచీ హీరో కావాలని అత‌ను కలలు కనేవాడు. టీనేజీ దాటిన తర్వాత నటన, ఫైట్లు, డ్యాన్స్‌లో కఠోర శిక్షణ తీసుకున్నాడు. ఆ టైమ్‌లోనే నటుడిగా మారాలంటే వేరే మార్గం అవసరమని గ్రహించిన సందీప్ కిష‌న్‌.. సూర్య s/o కృష్ణన్ సినిమా కోసం గౌతమ్ వాసుదేవ్ మీనన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యాడు. దాదాపు ఏడాది పాటు ఆయ‌న వ‌ద్ద ప‌ని చేశాడు.

Actor Sundeep Kishan Family Photos | Latest | Movies

ఆ త‌ర్వాత తెలుగు సినిమా కోసం కాస్టింగ్ కాల్‌ని గమనించి ఆడిషన్స్ లో పాల్గొన‌డం ప్రారంభించాడు. అప్పుడే మ్యూజికల్-డ్రామా స్నేహగీతంలో అర్జున్‌గా ప్రధాన పాత్ర పోషించడానికి సందీప్ కిష‌న్ ఖరారు చేయబడ్డాడు. అలాగే మ‌రోవైపు ప్రస్థానం మూవీలో డైరెక్ట‌ర్ దేవ క‌ట్టా ఓ క్యారెక్ట‌ర్ ను సందీప్ కు ఇచ్చారు. 2010లో ప్రస్థానం, స్నేహ గీతం చిత్రాలో సందీప్ కిష‌న్ త‌న న‌ట‌నా వృత్తిని ప్రారంభించాడు. అయితే దేవ‌ క‌ట్టాకు స్నేహితులైన దర్శక ద్వయం రాజ్ నిడిమోరు మరియు కృష్ణ డీకే.. ప్రస్థానం ర్యాషెస్ చూస్తుండ‌గా సందీప్ కిష‌న్ యాక్టింగ్ వాళ్ల‌ను బాగా ఆక‌ట్టుకుంది. వెంట‌నే రాజ్ అండ్ డీకే బాలీవుడ్ క్రైమ్-కామెడీ షోర్‌ ఇన్‌ ద సిటీ మూవీలో ఒక హీరోగా ఎంపిక చేసుకున్నారు. 2011లో విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. ఆ ఏడాది విడుద‌లైన టాప్ 3 చిత్రాల్లో ఒక‌టిగా నిలిచింది.

స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్న సందీప్ కిషన్ - Sandeep Kishan Is Going To Do A Movie With Star Director

మూడో సినిమాతోనే సెంథిల్ రామ్మూర్తి, ప్రీతి దేశాయ్ మరియు తుషార్ కపూర్ వంటి ప్రతిభావంతులైన నటులతో సందీప్ కిష‌న్‌ స్క్రీన్-స్పేస్‌ను పంచుకున్నాడు. ఆ త‌ర్వాత తెలుగులో రొటీన్ లవ్ స్టోరీ, గుండెల్లో గోదారి వంటి చిత్రాల్లో న‌టించాడు. 2013లో రిలీజ్ అయిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సందీప్ కిష‌న్ కెరీర్ ను మ‌లుపు తిప్పింది. న‌టుడిగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అదే ఏడాది యారుడా మహేష్ అనే చిత్రంతో సందీప్ కిషన్ త‌మిళంలో ఎంట్రీ ఇచ్చాడు. ఆపై తెలుగులో డి ఫ‌ర్ దోపిడి, రా రా కృష్ణయ్య, జోరు, బీరువా, టైగ‌ర్‌, ర‌న్‌, ఒక్క అమ్మాయి తప్పా, శమంతకమణి, న‌క్ష‌త్రం, తెనాలి రామకృష్ణ BA. BL తో స‌హ అనేక చిత్రాలు న‌టించాడు. అటు త‌మిళంలో మానగరం, నెంజిల్ తునివిరుంధాల్, మాయవన్, కసడ తబర వంటి ప‌లు చిత్రాలు చేశాడు.

Actor Sundeep Kishan Comments On Role In Vikram Movie | Sundeep Kishan: 'విక్రమ్' నుంచి అందుకే తప్పుకున్నా, లోకేష్ కనగరాజ్ ప్రపంచం మొదలైందే నాతో: సందీప్ కిషన్

బాలీవుడ్ లో షోర్‌ ఇన్‌ ద సిటీ త‌ర్వాత ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో న‌టించి అల‌రించాడు. టాప్ స్టార్స్ చెంత చేర‌లేక‌పోయినా తెలుగు, త‌మిళ భాష‌ల్లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ బేస్ ను ఏర్ప‌ర్చుకున్నాడు. త్వ‌ర‌లోనే ఊరు పేరు భైరవకోన అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేసేందుకు సందీప్ కిష‌న్ రెడీ అవుతున్నాడు. విఐ ఆనంద్ డైరెక్ష‌న్ లో ఫాంటసీ అడ్వెంచర్ గా తెరకెక్కిన ఈ మూవీని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మించారు. ఇందులో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా న‌టించారు. ఫిబ్ర‌వ‌రిలో ఈ చిత్రం విడుద‌లకు ముస్తాబ‌వుతోంది. దీంతో సందీప్ కిష‌న్ వ‌రుస ఇంట‌ర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాపై త‌న‌వంతు హైప్ పెంచుతున్నాడు. అలాగే ధ‌నుష్ 50వ చిత్రంలోనూ సందీప్ కిష‌న్ న‌టిస్తున్నాడు. ధ‌నుష్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కింది. ఇందులో ఓ కీల‌క పాత్ర‌లో సందీప్ కిష‌న్ క‌నిపించ‌డు.

Sundeep Kishan - Movies, Biography, News, Age & Photos | BookMyShow

మొత్తానికి హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా సందీప్ కిష‌న్ వ‌రుస సినిమాల‌తో బాగానే దూసుకుపోతున్నాడు. మ‌రోవైపు వ్యాపార‌రంగంలోనూ స‌త్తా చాటుతున్నాడు. నిజానికి సందీప్ కిష‌న్ న‌టుడు మాత్ర‌మే కాదు.. అత‌నికి సైడ్ బిజినెస్‌లు కూడా ఉన్నాయి. హైదరాబాద్‌లో వివాహ భోజనంబు పేర‌ట రెస్టారెంట్స్ ను సందీప్ ర‌న్ చేస్తున్నాడు. అలాగే విజయవాడలో ఎక్స్‌ప్రెస్ యూనిసెక్స్ అనే సెలూన్ వ్యాపారాన్ని ప్రారంభించి సూప‌ర్ స‌క్సెస్ అయ్యాడు. ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే.. 36 ఏళ్లు వ‌చ్చినా కూడా సందీప్ కిష‌న్ ఇంకా బ్యాచిల‌ర్ లైఫ్‌నే లీడ్ చేస్తున్నాడు. గ‌తంలో రాశి ఖ‌న్నా, రెజీనా, ర‌కుల్ ప్రీత్ సింగ్ వంటి హీరోయిన్ల‌తో సందీప్ ల‌వ్ లో ఉన్న‌ట్లు వార్త‌లు బాగా వైర‌ల్ అయ్యాయి. కానీ, వాటికి సందీప్ కిష‌న్ చెక్ పెట్టాడు. తాను ఏ హీరోయిన్ తో రిలేష‌న్ లో లేన‌ని క్లారిటీ ఇచ్చాడు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...