Home Film News Hero: 280 సినిమాల‌లో న‌టించినా ఆ హీరో ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఉన్నాడా..!
Film News

Hero: 280 సినిమాల‌లో న‌టించినా ఆ హీరో ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఉన్నాడా..!

Hero: స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న వారు కొన్ని ప‌రిస్థిత‌లు వ‌ల‌న కెరీర‌ర్‌ని ఎక్కువ రోజుల పాటు కొన‌సాగించ‌లేక‌పోయారు. అలాంటి వారిలో హ‌రీష్ ఒక‌రు(48). బాల‌న‌టుడిగా ప్ర‌స్థానం మొద‌లు పెట్టిన హ‌రీష్ అందగాడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పని చేసిన హ‌రీష్ ఆ త‌ర్వాత హీరోగా కూడా  ఆయా భాష‌ల‌లో రాణించాడు. దాదాపు 280కి పైగా సినిమాల‌లో ఆయ‌న న‌టించారు.హ్యాండ్సమ్ స్టార్ అనే ట్యాగ్ లైప్ పొందిన హ‌రీష్‌.. అక్కినేని నాగేశ్వర రావు, ధర్మేంద్ర, జితేంద్ర, మిథున్‌ చక్రవర్తి, రజినీకాంత్‌, కమల్‌ హాసన్‌, చిరంజీవి, గోవిందా వంటి టాప్ హీరోల‌తో క‌లిసి ప‌ని చేశాడు. ఆయ‌న కొన్నేళ్ల పాటు అద్భుతంగా రాణించిన రాను రాను అవ‌కాశాలు త‌గ్గాయి.

సినిమాలు త‌గ్గిన త‌ర్వాత హ‌రీష్ సోష‌ల్ మీడియా ద్వారా త‌న అభిమానుల‌కి ట‌చ్‌లో ఉంటున్నాడు.   1995లో సంగీతను పెళ్లి చేసుకున్న అత‌ను .. ఇద్దరు పిల్లలతో ప్రస్తుతం ముంబైలో ఉంటున్నాడు.  సినిమాల్లో అవకాశాలు లేని కార‌ణంగా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ పెట్టుకొని బాలీవుడ్ లో జరిగే ఈవెంట్స్ కి ఈవెంట్ మేనేజర్ గా ఉంటూ జీవితాన్ని కొన‌సాగిస్తున్నారు. అంత వెలుగు వెల‌గిన హ‌రీష్ ఇలా చేస్తున్నాడ‌నే స‌రికి ఆయ‌న అభిమానులు ఒకింత ఆందోళ‌న చెందుతున్నారు. ఇక హ‌రీష్ విష‌యానికి వ‌స్తే.. హైద్రాబాద్‌లో పుట్టి, పెరిగిన హరీష్‌..  ముద్దుల కొడుకు(1979) ద్వారా తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.  హ‌రీష్ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన ఆంధ్ర కేసరి.. ఆయ‌నకు  తొలి నంది అవార్డు తెచ్చిపెట్టింది.

హ‌రీష్ ముందు స‌పోర్టింగ్ రోల్స్ తో అల‌రించేవాడు.  ‘ప్రేమ ఖైదీ’ ద్వారా సెన్సేషన్‌ హీరోగా గుర్తింపు దక్కించుకున్న అత‌ను .. ‘పెళ్ళాం చెపితే వినాలి, రౌడీ ఇన్‌స్పెక్టర్‌, కాలేజీ బుల్లోడు, ప్రేమ విజేత, ఏవండీ ఆవిడ వచ్చింది, ప్రాణదాత, మనవరాలి పెళ్లి, బంగారు కుటుంబం, జైలర్‌గారి అబ్బాయి, ఎస్పీ పరుశరాం చిత్రాలతో ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ హీరోగా ప్రేక్ష‌కుల‌ని అల‌రించాడు.హిందీలో కరిష్మా కపూర్‌ ఫస్ట్‌ హీరో కూడా హరీషే కావ‌డం విశేషం. ప్రేమ ఖైదీ హిందీ రీమేక్‌లో హరీష్‌ సరసన న‌టించిన‌ కరిష్మా ఈ సినిమాతోనే చిత్ర సీమ‌లోకి అడుగుపెట్టింది. హ‌రీష్ కి  సరైన దిశా నిర్దేశం చేసేవారు ఎవరూ లేకపోవడంతో కథలు ఎంపికలో తడ‌బ‌డ‌తూ కెరీర్ ముందుకు తీసుకెళ్ల‌లేక‌పోయారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...