Home Film News Pawan Kalyan: నాకు ప్రాణ హానీ ఉందంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Film News

Pawan Kalyan: నాకు ప్రాణ హానీ ఉందంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Pawan Kalyan: సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తోను బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకుంటూ వాటికి సత్వ‌ర ప‌రిష్కారం చూపే ప్ర‌యత్నం చేస్తున్నాడు.అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా అధికార పార్టీ వైసీపీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ త‌న‌కి ప్రాణ హానీ ఉంద‌ని తెలియ‌జేశారు. అధికారం చేజిక్కించుకునే నాయకులు ఎప్పుడు చాలా క్రూరంగా ఆలోచిస్తారని..  అధికారం కోల్పోకుండా బలంగా  ఆలోచిస్తార‌ని.. అవసరమైతే కడుపులోని బిడ్డను కూడా చంపడానికి వెనుకాడరని పవన్ కళ్యాణ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇదే క్ర‌మంలో త‌న‌కు ప్రాణ హానీ ఉంద‌ని కూడా అన్నారు.

కొందరు నా కోసం ప్రత్యేకంగా కొన్ని సుపారీ గ్యాంగులను రంగంలోకి దింపారని పూర్తి  సమాచారం ఉంది అని పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం సాయంత్రం కాకినాడ‌లో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన పార్టీ నేతలు, జన సైనికులు, వీర మహిళలతో జరిగిన సమావేశంలో వారిని ఉద్దేశించి  పవన్ కళ్యాణ్  ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.  బాలు సినిమా సమయంలో ఓ ఐపీఎస్ అధికారి నా దగ్గరకు వచ్చి మీ కుటుంబంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టాలని అనుకుంటున్నారా అని అడిగారు.. అప్పుడు నేను  ఎందుకు అని నేను అడిగాను. అప్పుడు ఆయ‌న చెప్పిన స‌మాధానం ఏంటంటే.. మీ కుటుంబానికి కాస్త హాని తలపెట్టే అవకాశం ఉందని చెప్పారు.

రాజకీయాల్లోకి మా కుటుంబం క‌నుక  వస్తే అప్పట్లో అధికారంలో ఉన్న నాయకులకు భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుందని, మేం రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పించేందుకు మా ఇంటి ఆడబిడ్డల మీద విపరీతమైన దుష్ర్పచారం చేసేందుకు రంగం సిద్ధం చేశార‌ని ప‌వ‌న్ అన్నారు. రాజకీయాల్లో పదవి పోతుందనే భయం చాలా చెడ్డదని, త‌మ‌కు న‌ష్టం వాటిల్లితుందంటే వారు ఎంతకైన తెగిస్తారంటూ ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు. ఇప్పుడు ఎంతో బ‌లంగా ఉన్న జ‌న‌సేన‌.అధికారం నుంచి వైసీపీ పాలకులను గద్దె దించే ప్ర‌య‌త్నంలో  వారు ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నారు.   కచ్చితంగా భద్రతా నియమాలను నాయకులతో పాటు జనసైనికులు, వీర మహిళలు తప్పనిసరిగా పాటించాలి అంటూ పార్టీ శ్రేణులను హెచ్చరించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.  తనను భయపెట్టే కొలది తాను మరింత రాటు దేలుతానంటూ ప‌వ‌న్ తెలియ‌జేశారు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...