Home Film News Negative Tweets: ఆదిపురుష్‌పై నెగెటివ్ ట్వీట్స్ డిలీట్ చేస్తే అంత డ‌బ్బు వ‌స్తుందా..!
Film News

Negative Tweets: ఆదిపురుష్‌పై నెగెటివ్ ట్వీట్స్ డిలీట్ చేస్తే అంత డ‌బ్బు వ‌స్తుందా..!

Negative Tweets: భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఆదిపురుష్ చిత్రం డిజాస్ట‌ర్ అయింది. ద‌ర్శ‌కుడు ఓం రౌత్ క‌థ‌ని వ‌క్రీక‌రించి త‌న‌కు న‌చ్చిన‌ట్టుగా సినిమా తీసాడ‌ని కొంద‌రు వాపోతున్నారు.ఇది క‌లియుగ రామాయ‌ణంలా ఉంద‌ని, చిత్రంలో రాముడి పాత్ర‌, సీత పాత్ర‌, రావ‌ణుడి పాత్ర ఏమంత బాగోలేవ‌ని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.అయితే సినిమాపై ఒకవైపు నెగెటివ్ టాక్ వ‌స్తున్నా కూడా వ‌సూళ్లు బాగానే వ‌స్తున్నాయి. కాక‌పోతే ద‌ర్శ‌కుడితో పాటు చిత్ర బృందంపై సోష‌ల్ మీడియాలో దారుణ‌మైన ట్రోలింగ్ న‌డుస్తుంది.  డైరెక్ట‌ర్  ఓం రౌత్ మన సంస్కృతిని పక్కన పెట్టి  హర్రర్ మూవీలా రామాయణాన్ని మార్చేసాడ‌ని మండిప‌డుతున్నారు.ఆ స్థానంలో హీరోగా ప్ర‌భాస్ లేక‌పోయి ఉంటే మూవీ భారీ ఫ్లాప్‌గా నిలిచేద‌ని చెబుతున్నారు.

అయితే  ఆదిపురుష్ చిత్రం దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో రూపొంద‌గా, ఈ మూవీకి పెట్టిన పెట్టుబ‌డి వ‌స్తుందా అనేది ప్రశ్నార్ధకంగానే మారింది.. ఎక్క‌డ చూసిన కూడా మూవీపై నెగెటివ్ టాక్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో 500 కోట్ల రూపాయ‌లు రాబ‌ట్ట‌డం అసాధ్య‌మే అంటున్నారు ట్రేడ్ పండితులు. మ‌రోవైపు ఈ సినిమాని అనేక వివాదాలు చుట్టు ముడుతున్నాయి. తాజాగా ఆదిపురుష్ మేక‌ర్స్ డ్యామేజ్ కంట్రోల్ చేయ‌డానికి రాంగ్ వేని ఎంచుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. డాక్టర్ నిమో యాదవ్ అనే వ్యక్తికి ట్విట్టర్ లో 50 వేల‌కి పైగా ఫాలోవ‌ర్స్ ఉండ‌గా, ఆయ‌న  చేసిన ఆరోపణలు ఇప్పుడు  సంచలనం రేపుతున్నాయి.

ఓ అజ్ఞాత వ్య‌క్తి.. నిమోకి మెసేజ్ ఇలా పెట్టాడు. ‘హలో డాక్టర్ నిమో యాదవ్, మీకు అర్జెంటు రిక్వెస్ట్.. ఆదిపురుష్ పై నెగిటివ్ ట్వీట్స్ డిలీట్ చేసి పాజిటివ్ పోస్ట్ లు పెడితే..ఒక్కో పోస్ట్ కి రూ 9500 ఇస్తాం. వెంటనే అలా చేసి ఆ విష‌యాన్ని మాకు తెలియజేయండి మీకు డబ్బు వస్తుంది’ అనే మెసేజ్ రాగా, దానిని అతడు తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.  మరో ట్విట్టర్ యూజర్ కి కూడా ఇలాంటి డీల్ కుదిరింది. రోషన్ రాయి అనే యూజర్ కి ట్విట్టర్ లో 11 వేలమంది ఫాలోవర్స్ ఉండ‌గా, అత‌ను త‌న సోష‌ల్ మీడియాలో  టి సిరీస్ సంస్థకి చెందిన కొందరు ఆదిపురుష్ పై నెగిటివ్ ట్వీట్స్ డిలీట్ చేసి పాజిటివ్ ట్వీట్స్ పెట్టమని డీల్ ఇస్తున్నారు.  రూ.5500 ఆఫర్ చేస్తున్నారు. అయితే నాకు మెసేజ్ పెట్టిన వాళ్ళు రాంగ్ పర్సన్ ని ఎంచుకున్నారు అంటూ పోస్ట్ పెట్టాడు. మ‌రి ఇలా డబ్బు ఆఫర్ చేసింది మేకర్సేనా లేక వేరే ఎవ‌రైననా అనే విష‌యం తెలియాల్సి ఉంది.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...