Home Film News Bro Shoes: బ్రో సినిమా కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ధ‌రించిన షూస్ అన్ని వేల రూపాయలా..!
Film News

Bro Shoes: బ్రో సినిమా కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ధ‌రించిన షూస్ అన్ని వేల రూపాయలా..!

Bro Shoes: సినిమా వాళ్ల‌కి సంబంధించిన విష‌యాల‌పై జ‌నాలు ఎంతో ఆస‌క్తి చూపుతుంటార‌నే సంగ‌తి తెలిసిందే. వారు ధ‌రించే బ‌ట్ట‌లు, పెట్టుకునే వాచెస్, వేసుకునే షూస్, ప్ర‌యాణించే కార్లు ఇలా ప్ర‌తి ఒక్క దాని గురించి ఆరాలు తీస్తుంటారు. అంతేకాదు వాటి ధ‌ర తెలుసుకొని నోరెళ్ల‌పెడుతుంటారు.  తాజాగా ప‌వ‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్రో సినిమా కోసం ధ‌రించిన షూ కాస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే జ‌నాల‌లో ఎంత పిచ్చి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దాదాపు అంద‌రు ఆయ‌న‌లా ఉండాల‌ని, ఆయన స్టైల్‌ని అనుక‌రించాల‌ని, ఆయ‌న మాదిరిగానే రెడీ అవ్వాలని కూడా అనుకుంటూ ఉంటారు.

ఇప్పుడు రాజ‌కీయాల‌లో ఉండ‌డం వ‌ల‌న ప‌వ‌న్ చాలా నార్మ‌ల్‌గా బ‌య‌ట క‌నిపిస్తున్నాడు. లేదంటే ఆయ‌న స్టైల్ చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది.  ఒక‌వైపు రాజ‌కీయాల‌లో బిజీగా ఉన్న కూడా ప‌వ‌న్ సినిమాలు చేస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్, మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి  ‘బ్రో’ అనే చిత్రాన్ని చేశారు. దీనికి ది అవతార్ క్యాప్షన్ ఉంచ‌గ‌గా, ఈ చిత్రాన్ని డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కించారు. మూవీకి.. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్  అందించారు. జూలై 28న విడుద‌ల కానున్న ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవ‌ల టీజ‌ర్ విడుద‌ల కాగా, ఈ టీజ‌ర్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించింది అనే చెప్పాలి.

చిత్రంలో ప‌వ‌న్ గెటప్  ఆయన వేసుకున్న షూస్ గురించి..వాటి ధ‌ర గురించి ఇప్పుడు నెట్టింట ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంది. చిత్ర పోస్ట‌ర్‌లో ప‌వ‌న్ వేసుకున్న షూస్‌.. బాలెన్సియాగా బ్రాండ్‌కి చెందినవని, ఇవి  డిఫెండర్ బ్లాక్ స్నీకర్స్ షూస్ కాబ‌ట్టి వాటి ధ‌ర‌  88,732 వేలు అని తెలుస్తోంది. ఎంతో స్టైలిష్‌గా ఉన్న షూస్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి బాగా సూట‌య్యాయ‌ని అంటున్నారు. ఏదేమైన ఇప్పుడు ప‌వ‌న్ ధ‌రించిన షూస్ గురించి నెట్టింట తెగ చర్చ న‌డుస్తుంది. ఇక ప‌వ‌న్ న‌టిస్తున్న‌ ఓజీ’ సగం పార్ట్ షూట్ కంప్లీట్ చేసుకోగా,  ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇటీవలే సెట్స్‌‌పైకి వెళ్లింది. ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియ‌ని ప‌రిస్థితి.

Related Articles

మహేష్ – సాయి పల్లవి కాంబోలో మిస్సయిన బ్లాక్ బస్టర్ మూవీలు ఏమిటో తెలుసా..!

చిత్ర పరిశ్రమల్లో కొన్ని క్రేజీ కాంబినేషన్లు ఉంటాయి.. అలాంటి కాంబోలో మహేష్ – సాయి పల్లవి...

సినిమాల్లోకి రాక‌ముందు నాగ శౌర్య ఏం చేసేవాడు.. ఆ హీరోయిన్ల‌తో ఎఫైర్‌ నిజ‌మేనా..!?

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరోల్లో నాగ శౌర్య ఒక‌రు. ఊహలు గుసగుసలాడే సినిమాతో...

‘కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా’… ఈ డైలాగ్ బాల‌య్యది కాద‌ని తెలుసా..?

నందమూరి బాలకృష్ణ నటించిన ‘నరసింహనాయుడు’ చిత్రంలో ‘కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా’ అనే డైలాగ్‌...

38 ఏళ్ల కెరీర్ లో విక్ట‌రీ వెంక‌టేష్ ఎన్ని సినిమాలను రిజెక్ట్ చేశారు.. అందులో హిట్లు ఎన్నో తెలుసా?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక సక్సెస్ రేటు ఉన్న హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. అత్యధిక...