Home Film News Balayya: అభిమానులు త‌ప్పు చేస్తే చెంప చెళ్లుమ‌నిపించే బాల‌య్య‌.. బిడ్డలు త‌ప్పు చేస్తే ఏం చేస్తాడంటే..!
Film News

Balayya: అభిమానులు త‌ప్పు చేస్తే చెంప చెళ్లుమ‌నిపించే బాల‌య్య‌.. బిడ్డలు త‌ప్పు చేస్తే ఏం చేస్తాడంటే..!

Balayya: టాలీవుడ్ సీనియ‌న్ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ ఇప్ప‌టికీ కుర్ర హీరోల‌తో పోటీప‌డి సినిమాలు చేస్తున్నాడు. హిందూపురం ఎమ్మెల్యేగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూనే మ‌రోవైపు సినిమాల‌లో కూడా తెగ సంద‌డి చేస్తున్నాడు. ఇక అన్‌స్టాప‌బుల్ అనే షోతో హోస్ట్ అవ‌తారం కూడా ఎత్తి అద‌ర‌గొట్టాడు. ఈ షో ఇండియాలోని అనేక టాక్ షోల రికార్డ్‌ల‌ని తుడిచి పెట్టింది. ఇక బాల‌య్య సినిమాల సంగ‌తి  ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. అఖండ‌, వీర‌సింహారెడ్డి చిత్రాల‌తో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టిన బాల‌య్య ఇప్పుడు అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో త‌న 108వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. అయితే తాజాగా బాల‌య్య‌కి సంబంధించిన ఓ వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

బాల‌య్య‌తో ఎక్కువ పరిచయం ఉన్న‌వాళ్లు ఆయ‌న‌ది చిన్న పిల్లాడి మ‌న‌స్త‌త్వం అంటారు. కాస్త ముక్కు మీద కోపం ఎక్కువ‌ని,  ఉన్నది ఉన్నట్లే మాట్లాడుతాడు అని అంటుంటారు. ఒక్కోసారి బాల‌య్య త‌న అభిమానుల విష‌యంలో ఎంత దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తుంటారో మ‌నం కూడా చూస్తూనే ఉంటాం. మ‌రి అభిమానులు త‌ప్పు చేస్తే చెంప చెళ్లుమ‌నిపించే బాల‌య్య   తన బిడ్డలు తప్పు చేస్తే ఎలా ఉంటాడు..? ఎలా ట్రీట్ చేస్తారని ఎంతో మందికి  తెలుసుకోవాలని ఉంటుంది. కాగా తన కుటుంబ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య ఇంట్లో కూడా అంతే అగ్రెసివ్‌గా ఉంటార‌ట‌.

త‌న పిల్ల‌ల‌కి మొద‌టి నుండి బాల‌య్య కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాడ‌ట‌. ఆ రూల్స్ వారు అతిక్ర‌మిస్తే బ్రాహ్మ‌ణి, తేజ‌స్విని, మోక్ష‌జ్ఞ‌ల‌కి ముందు కూర్చోపెట్టి మంద‌లిస్తాడ‌ట‌. రెండోసారి త‌ప్పు చేసిన కూడా కూల్‌గానే చెబుతాడ‌ట‌. మూడోసారి చేస్తే మాత్రం  రఫ్ఫాడించేస్తారట. అయితే బాల‌య్య పిల్ల‌లు మాత్రం  అంతవరకు తెచ్చుకోరని వారి కుటుంబ స‌భ్యులు చెప్పుకొస్తున్నారు.  ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమాలో నటిస్తున్న బాల‌య్య‌.. ఈ చిత్రం పూర్తి కాగానే  బాబి దర్శకత్వంలో సినిమా చేయ‌నున్నాడు.  ఈ సినిమా అయిపోయిన తర్వాత బోయపాటి శ్రీనుతో అఖండ 2 అనే సినిమాను తెరకెక్కించే అవ‌కాశం ఉంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...