Home Film News Silk Smitha: ఏంటి.. సిల్క్ స్మిత ఆ హీరోయిన్ అంట్లు తోమిందా.. అలాంటి ప‌రిస్థితి ఎందుకొచ్చింది..!
Film News

Silk Smitha: ఏంటి.. సిల్క్ స్మిత ఆ హీరోయిన్ అంట్లు తోమిందా.. అలాంటి ప‌రిస్థితి ఎందుకొచ్చింది..!

Silk Smitha: జీవితంలో ఎన్నో అవమానాలు, మ‌రెన్నో ఎత్తు ప‌ల్లాలు చూసి అనేక ఒడిదుడుకుల‌ని ఎదుర్కొన్న అందాల తార సిల్క్ స్మిత చివ‌ర‌కు ఆత్మ‌హ‌త్య చేసుకొని క‌న్నుమూసింది.   మేకప్ ఆర్టిస్ట్ గా కెరీర్ ఆరంభించి.. ఆ తర్వాత స్టార్ గా ఎదిగిన ఈ మ‌త్తు క‌ళ్ల సుందరి  జీవితంలో ఎన్నో కష్టాలు పడింది. ఆకాశంలోకి తారాజువ్వలా  రివ్వున దూసుకెళ్లి వెలుగులు చిమ్మిన సిల్క్ స్మిత‌ అంతలోనే కనుమరుగైంది. నటన, అందంతో పాటు తన డ్యాన్స్‌లతో అల‌రించిన సిల్క్ స్మిత జీవితం అర్ధాంత‌రంగా ముగియ‌డం ప్ర‌తి ఒక్క‌రిని బాధించింది. దాదాపు 200పైగా తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలలో నటించింది సిల్క్ స్మిత‌.

ప్రత్యేక గీతాలు, శృంగార నృత్యాలు సిల్క్‌కి ఎక్కడలేని క్రేజ్ తెచ్చి పెట్టాయి. తెలుగులో “బావలు సయ్యా, మరదలు సయ్యా” పాట ఇప్పటికి ఎక్క‌డో చోట మోగుతూనే ఉంటుంది.అయితే ఏడు సంవత్సరాల వయసు నుంచి ఎన్నో క‌ష్టాలు ప‌డుతూ ఉన్న‌త స్థాయికి చేరుకుంది సిల్క్ స్మిత‌. అందరూ తన కష్టాన్ని దోచుకునే వారి తప్ప తనను అర్థం చేసుకునే వాళ్ళు ఎవ‌రు లేర‌ని చాలా సార్లు బాధ‌ప‌డింది. త‌న‌ని చాలా మంది మోసం చేశార‌ని సిల్క్ స్మిత ప‌లు సంద‌ర్భాల‌లో చెప్పుకొచ్చింది. సూసైడ్ నోట్‌లో కూడా త‌న‌ని మోసం చేసిన ప‌లువురి పేర్లు రాసుకొచ్చింది.

అయితే సినిమాల‌లో న‌టించాల‌నే ఆస‌క్తి సిల్క్ స్మిత‌కి చాలా ఉండ‌గా, ఆమెకి  మొదటి అవకాశం వచ్చింది దాసరి నారాయణరావు.ఒక మగాడు ఒక ఆడది సినిమాలో స్మిత తొలి అవ‌కాశం ద‌క్కించుకోగా, ఆ త‌ర్వాత  తమిళంలో కొన్ని బోల్డ్ పాత్రల్లో నటించింది.. ఇక సిల్క్ స్మిత  ఎప్పుడైతే ఆ పాత్రల్లో నటించిందో అప్పటి నుండి ఐటెం సాంగ్స్ ఆఫ‌ర్స్ ఈ అమ్మ‌డి వెన‌క ప‌డ్డాయి.దాంతో ఈ భామ స్టార్ రేంజ్‌కి ఎదిగింది. అయితే  1980ల‌లో  ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన  సిల్క్ స్మిత అప్ప‌టి స్టార్ హీరోయిన్ అయిన అపర్ణ  ఇంట్లో సినిమాల్లోకి రాకముందు పనిమనిషిగా చేసిందట.   ఇంట్లో పనులన్నీ ముగిసిన త‌ర్వాత  ఆఫీసులన్నీ తిరిగేదట. అలా ఎంతో క‌ష్ట‌ప‌డితే కాని సిల్క్ స్మిత‌కి స్టార్ స్టేటస్ ద‌క్క‌లేదు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...