Home Film News Pawan Kalyan: మ‌ళ్లీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని టార్గెట్ చేసిన ఆ హీరోయిన్..బ్రో వివాదంపై ఆస‌క్తిక‌ర ట్వీట్
Film News

Pawan Kalyan: మ‌ళ్లీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని టార్గెట్ చేసిన ఆ హీరోయిన్..బ్రో వివాదంపై ఆస‌క్తిక‌ర ట్వీట్

Pawan Kalyan: ఎప్పుడైతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల‌లోకి వ‌చ్చారో అప్ప‌టి నుండి సినిమాలు కూడా చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాన్ న‌టించిన బ్రో సినిమా చుట్టూ వివాదం న‌డుస్తున్న విష‌యం తెలిసిందే.  చిత్రంలో అంబ‌టి రాంబాబుని ప‌వ‌న్ క‌ళ్యాణ్ సెటైరిక‌ల్‌గా చూపించార‌ని విమ‌ర్శ‌లు రావ‌డంతో అంటి వెంటే స్పందించి   త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్‌లను ఏకిపారేశాడు.అంతేకాదు  సినిమా కలెక్షన్లను, లెక్కలను ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పేశాడు. నిర్మాతది అంతా బ్లాక్ మనీ  కాగా, ఆయ‌న ఇలా వైట్ మనీగా మార్చుకుంటున్నారని అన్నాడు.   పవన్ కళ్యాణ్‌కి ఇచ్చిన రెమ్యూనరేషన్ అంత కూడా కలెక్షన్లు రావడం లేదంటూ ఆయ‌న కొన్ని లెక్క‌లు చెప్పారు. అంబ‌టి వ్యాఖ్య‌ల‌పై  నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ కూల్‌గానే స్పందించాడు.

మాకు సంస్కారం ఉంది కాబ‌ట్టి వారిలా నేను అలా మాట్లాడలేను. పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇచ్చాను అన్నది ఆయనకు, మాకు తెలుసు కాబ‌ట్టి వేరే వాళ్లకి చెప్పాల్సిన పని లేదు అని ఆయ‌న అన్నారు. అయితే బ్రో సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌ని ఇమిటేట్ చేశాడ‌ని భ‌గ్గుమంటున్న అంబ‌టి.. తాను కూడా  పవన్ కళ్యాణ్ మీద కూడా సినిమా తీస్తామని వింత వింత టైటిళ్లు ప్రకటించాడు. ఆ టైటిల్స్ అన్ని కూడా  పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు చుట్టే తిరిగాయి. ఇలా ఏపీ రాజ‌కీయం అంతా ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్రో చుట్టూ తిరుగుతున్న నేప‌థ్యంలో హీరోయిన్ పూన‌మ్ కౌర్ త‌న సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర ట్వీట్ చేసింది.

ఇటీవ‌లి కాలంలో రాజకీయాలు అనేవి ఎంతో వినోదాత్మకంగా మారాయి.. ఎంటర్టైన్మెంట్ అనేది  ఎంతో సీరియస్‌గా మారింది.. అంటూ పూన‌మ్ ట్వీట్ చేయ‌గా, ఇప్పుడు ఈ ట్వీట్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న ట్వీట్‌లో ఎవ‌రి పేరు ప్ర‌స్తావించ‌క‌పోయిన కూడా ఆమె ప‌వ‌న్‌ని ఉద్దేశించే ట్వీట్ చేసింద‌ని భావించిన ప‌వ‌న్ అభిమానులు  పూనమ్ కౌర్‌ను తిట్టిపోస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌త్య‌ర్థులు మాత్రం  కరెక్ట్‌గా చెప్పావ్ సిస్టర్ అంటూ పొగిడేస్తున్నారు. మొత్తానికి పూనమ్ ట్వీట్ మాత్రం ఇప్పుడు అంత‌టా హాట్ టాపిక్‌గా మారింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...