Home Film News Rajamouli: రాజ‌మౌళికి భారీ న‌ష్టాలు మిగిల్చిన ఓ సినిమా ఉంది.. అదేంటో తెలుసా?
Film News

Rajamouli: రాజ‌మౌళికి భారీ న‌ష్టాలు మిగిల్చిన ఓ సినిమా ఉంది.. అదేంటో తెలుసా?

Rajamouli: ఓట‌మెరుగ‌ని విక్ర‌మార్కుడిగా మంచి పేరు తెచ్చుకున్న రాజ‌మౌళి బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ సినిమాల‌తో చ‌రిత్ర సృష్టించాడు. ఒక‌ప్పుడు బుల్లితెర‌పై సంద‌డి చేసి ఆ త‌ర్వాత వెండితెర‌పై అద్భుతాలు సృష్టిస్తున్నాడు. స్టూడెంట్ నెం1 సినిమాతో ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌స్థానం మొద‌లు పెట్టిన జ‌క్క‌న్న ఇప్పుడు త‌న క్రేజ్ విశ్వవ్యాప్తం చేశాడు. త్వ‌ర‌లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో హ‌లీవుడ్ రేంజ్ లో ఓ చిత్రం చేయ‌నుండగా, ఈమూవీ మ‌రిన్ని అద్భుతాలు సృష్టించ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌తి ఒక్క‌రు చెబుతున్న మాట‌. ఆగ‌స్ట్ 9న ఈ ప్రాజెక్ట్ పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లు కానుండ‌గా, వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో షూటింగ్ మొద‌లు కానున్న‌ట్టు తెలుస్తుంది.

రెండున్న‌ర ద‌శాబ్దాల సినీ ప్ర‌స్థానంలో రాజ‌మౌళి మొత్తం 13 చిత్రాలకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ చిత్రాలు ఒకటిని మించి మరొక‌టి అనేలా ఉన్నాయి. తాను తీసిన ప్ర‌తి చిత్రం కూడా రాజ‌మౌళికి విజ‌యాలు అందిస్తూనే ఉంది. అప‌జ‌యం అన్న‌ది రాజ‌మౌళి హిస్ట‌రీలోనే లేక‌పోగా, ఫ్లాపుల‌లో ఉన్న హీరోల‌ని సైతం స్టార్ హీరోలుగా నిల‌బెట్టిన ఘ‌న‌త రాజ‌మౌళిది. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఆర్ఆర్ఆర్ అనే సినిమా తెర‌కెక్కించి టాలీవుడ్ కి ఏళ్ల నుంచి క‌ల‌గా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డును కూడా తీసుకొచ్చి ఆసాధ్యుడిని అని నిరూపించుకున్నాడు జ‌క్క‌న్న‌.

 

రాజ‌మౌళి అంటే ఆయ‌న సినిమాలన్నీ హిట్, ఒక్క సినిమా కూడా ఆయ‌న‌కి న‌ష్టం మిగ‌ల్చ‌లేద‌ని అంద‌రు భావిస్తుంటారు. కాని రాజ‌మౌళికి కూడా ఓ చిత్రం న‌ష్టాల‌ని మిగిల్చింది. అది మ‌రేదో కాదు నితిన్, జెనీలియా ప్రధాన పాత్ర‌ల‌లో రూపొందిన సై. శ్రీ భారత్ ఎంటర్ ప్రైజెస్ బ్యాన‌ర్ పై కాలేజీ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని జ‌క్క‌న్న తెర‌కెక్కించారు. 2004 సెప్టెంబరు 23న విడుద‌లైన సై మూవీని రూ. 8 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించగా, లాంగ్ ర‌న్ లో రూ. 12 కోట్లు సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకి వ‌చ్చిన యావ‌రేజ్ టాక్ కార‌ణంగా కొన్ని కొన్ని ఏరాయాల్లో మాత్రం డిస్ట్రిబ్యూట‌ర్ ల‌కి తీవ్ర న‌ష్టాలు వ‌చ్చాయి. సాధార‌ణంగా రాజ‌మౌళి సినిమాలంటే పెట్టిన బ‌డ్జెట్ క‌న్నా మూడు రెట్లు ఎక్క‌వ వ‌సూళ్లు వ‌స్తాయి. కాని సై విష‌యంలో అలా జ‌ర‌గ‌లేదు.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...