Home Film News Sai Pallavi : సావిత్రి, సౌందర్య తర్వాత సాయి పల్లవే..
Film News

Sai Pallavi : సావిత్రి, సౌందర్య తర్వాత సాయి పల్లవే..

Sai Pallavi - Savitri - Soundarya
Sai Pallavi - Savitri - Soundarya

Sai Pallavi: సాయి పల్లవి.. ఈ పేరు చెప్పగానే వెంటనే.. మోస్ట్ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్.. అంతేకాదు.. వండర్ ఫుల్ డ్యాన్సర్ కూడా.. అని చెప్పేస్తారు. సినిమాల్లోకి రావడానికి ముందే రియాలిటీ షోస్‌లో డ్యాన్స్‌తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

ఇక హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చాక సాయి పల్లవి నటనతో పాటు నాట్యానికి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. మాతృభాష మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌లోనూ సాయి పల్లవికి మంచి క్రేజ్ ఉంది.. ‘వచ్చిండే’, ‘రౌడీ బేబీ’, ‘ఏవండోయ్ నాని గారు’, ‘సారంగదరియా’.. ఈ సాంగ్స్ అంత బాగా క్లిక్ అవడానికి మెయిన్ రీజన్ సాయి పల్లవే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇప్పుడు ‘విరాట పర్వం’ తో అందరూ అనుకున్నట్టుగానే మరోసారి సత్తా చాటింది. నేచురల్ పర్ఫార్మెన్స్‌తో వెన్నెల క్యారెక్టర్‌లో జీవించేసింది సాయి పల్లవి. ఆ క్యారెక్టర్ తనకోసమే పుట్టిందా అనే స్థాయిలో పర్ఫార్మ్ చేసింది. రీసెంట్‌గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, సాయి పల్లవి క్రేజ్ చూసి ‘లేడీ పవర్ స్టార్’ అని పిలిచారు.

‘విరాట పర్వం’ చూసిన తర్వాత చాలా మంది అప్పట్లో సావిత్రి, ఆ తర్వాత సౌందర్య.. ఇప్పుడు సాయి పల్లవి అంటూ ప్రశంసిస్తున్నారు. మూవీలో తాము ఊహించినదానికంటే ఎక్కువగా సాయి పల్లవి నటించిందని.. వెన్నెల పాత్ర తను తప్ప మరెవరూ చెయ్యలేరని.. తెలుగులో ఒకప్పుడు ‘మహానటి’ సావిత్రి గారు, తర్వాత సౌందర్య గారు ఎంతటి ఆదరణ పొందారో, ప్రేక్షకుల మనసుల్లో ఎలాంటి స్థానాన్ని సంపాందిచుకున్నారో.. ఇప్పుడు సాయి పల్లవి కూడా అలాంటి ప్లేసే దక్కించుకుందని ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...