Home Film News Kota: కోట హద్దులు దాటొద్దు.. పవన్ మాట్లాడిన దాంట్లో తప్పేముందంటున్న నట్టి
Film News

Kota: కోట హద్దులు దాటొద్దు.. పవన్ మాట్లాడిన దాంట్లో తప్పేముందంటున్న నట్టి

Kota: టాలీవుడ్ గొప్ప న‌టుల‌లో కోట శ్రీనివాస‌రావు ఒక‌రు. ఆయ‌న పండించ‌న హాస్యం, విలనిజం ప్ర‌ద‌ర్శించిన తీరు అభిమానులు ఏమాత్రం మ‌రచిపోలేరు. వ‌యోభారం కార‌ణంగా ప్ర‌స్తుతం సినిమాల‌కి దూరంగా ఉంటున్న కోట వివాదాల‌తో వార్త‌ల‌లోకి ఎక్కుతున్నాడు. ప‌లు సంద‌ర్భాల‌లో ప‌లువురు స్టార్స్ గురించి అవ‌కాలు చెవాకులు పేలుస్తున్నాడు. త‌న‌పై ఎవ‌రెన్ని విమ‌ర్శ‌లు చేసిన కూడా త‌ను అనుకున్న‌ది చెప్పి తీరుతున్నాడు. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై నిప్పులు చెరిగాడు. రోజుకు రూ.2 కోట్లు తీసుకుంటా అంటూ పవన్ కళ్యాణ్  స్టేట్ మెంట్ ఇవ్వడాన్ని కోట త‌ప్పుబ‌ట్టారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి హీరోలు ఏ రోజు కూడా  తమ రెమ్యునరేషన్ గురించి మాట్లాడలేదు, కాని ఇప్పుడు మాత్రం  మైకు పట్టుకొని కోట్లు రూపాయలు తీసుకుంటున్నామని చెప్ప‌డం బాగాలేద‌ని అన్నారు.

అయితే కోట వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు గ‌ట్టిగానే స్పందించారు. తాజాగా నిర్మాత న‌ట్టి కుమార్ ఈ విష‌యంపై స్పందిస్తూ..  వయస్సు అయ్యిపోయిన కోట శ్రీనివాసరావుకు ఇవ‌న్నీ అవ‌స‌ర‌మా…పవన్ కళ్యాణ్ నిజాయితీగా ,నీతిగా  టాక్స్ కడుతున్నాడు..నేను టాక్స్ పేయర్ ని అని చెప్పిన ఆయ‌న‌ నేను ఇంత తీసుకుంటున్నా .. కాని ప్ర‌జ‌ల కోసం అవ‌న్నీ వ‌దులుకొని రాజ‌కీయాల‌లోకి వ‌చ్చాను. మీ కోసం క‌ష్ట‌ప‌డుతున్నాను.  నాకు ఓటేసి గెలిపిస్తే మ‌రింత  కష్టపడతా అని అన్నారు. ఆయన టాక్స్ క‌డుతున్నాడు కాబట్టే ఓపెన్‌గా చెప్పాడు..కోట టాక్స్ ఎగ్గొడుతున్నాడు కాబట్టి  చెప్ప‌డం లేదా అని న‌ట్టి ప్ర‌శ్నించారు.

కోటకు మైక్ ఇస్తే ఏదేదో మాట్లాడుతున్నారు..ముసలాయన, ఏజ్ అయ్యిపోయింది, కాబట్టి కొంత‌ హద్దులో ఉంటే మంచిది.పవన్ కళ్యాణ్ రూపాయి ఇచ్చేవాడే కానీ ,ఎవరినీ ఇబ్బంది పెట్టే వ్య‌క్తి కాదు అని న‌ట్టి కుమార్ ప‌వ‌న్ ని స‌పోర్ట్ చేస్తూ మాట్లాడాడు. కాగా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ మీటింగ్‌లో  రెమ్యునరేషన్ గురించి కీలక విషయాలు చెప్పారు.  తాను డబ్బు కోసమే అధికారంలోకి రావాలని చూస్తున్నాడంటూ వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌పై త‌న రెమ్యురేష‌న్ గురించి చెబుతూ తీవ్రంగా స్పందించారు. అవసరమైతే నేను సంపాదించి, వచ్చిన‌ డబ్బును దాన ధర్మాల కోసం వినియోగిస్తాను అని స్ప‌ష్టం చేశారు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...