Home Film News Pragathi: పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు.. ఆ హీరో వ‌ల‌న వెళ్లిపోదామ‌ని అనుకున్నానంటూ ప్ర‌గ‌తి కామెంట్స్
Film News

Pragathi: పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు.. ఆ హీరో వ‌ల‌న వెళ్లిపోదామ‌ని అనుకున్నానంటూ ప్ర‌గ‌తి కామెంట్స్

Pragathi: న‌టి ప్ర‌గ‌తి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు ఒక‌ప్పుడు హీరోయిన్‌గా నటించి ప్ర‌స్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా స‌త్తా చాటుతుంది. ప్ర‌గతి.. చాలా మధ్యతరగతి కుటుంబం నుంచి రాగా, ఈ అమ్మ‌డు మొద‌ట్లో మోడ‌లింగ్ చేయాల‌ని అనుకుంది. అయితే అప్ప‌ట్లో డ‌బ్బులు లేవ‌ట‌. ప‌రిస్థితుల‌కి అనుగుణంగా  మోడలింగ్ స్టార్ట్ చేసింద‌ట. త‌న లక్ కొద్ది నాకు హీరోయిన్ గా కూడా అవకాశాలు రాగా, వాటిని స‌రిగ్గా ఉపయోగించుకోలేక‌పోయింది ప్రగ‌తి. అయితే కెరీర్ సరిగ్గా ఎదుగుతున్న స‌మ‌యంలోనే ప్ర‌గ‌తికి పెండ్లి జ‌ర‌గ‌డం, హీరోయిన్‌గా అవ‌కాశాలు త‌గ్గుముఖం రావ‌డం జ‌రిగిపోయింది. దీంతో సినీ కెరియ‌ర్‌తో పాటు వ్య‌క్తిగ‌త జీవితం రెండూ  కోల్పోయింది ప్ర‌గ‌తి.   భర్తకు దూరం అయిన ఈ భామ ఇప్పుడు పిల్లలతో కలిసి ఉంటుంది.

ప్ర‌గతి 90 వ దశకం నుంచి న‌టిస్తూ ఫుల్ బిజీగా మారింది.  తల్లి, అత్త తరహా పాత్రలకు దర్శకులు ప్రగతినే ఎక్కువ‌గా సంప్రదిస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో ప్ర‌గ‌తి ఎక్కువ‌గా  సోషల్ మీడియాలో కొత్త ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు. తరచుగా జిమ్ వీడియోలు, ఇన్స్టా రీల్స్ పోస్ట్ చేస్తూ ప్రగతి బాగా పాపులర్ అయింది. ఇటీవ‌లి కాలంలో ఈ భామ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తూ హంగామా చేస్తుంది. ప్ర‌గ‌తి రీసెంట్‌గా తన కెరీర్ ఆరంభంలో జరిగిన సంఘటనలని  ప్ర‌స్తావిస్తూ ఎమోష‌న‌ల్ అయింది.  ఇంట్లో ఊరికే కూర్చుని తింటున్నావ్ అని తన తల్లి అనే మాటలతోనే క‌ష్టాలు త‌న‌కి మొద‌లే అయ్యాయ‌ని ప్ర‌గ‌తి చెప్పుకొచ్చింది. డబ్బు కోసం పిజ్జా షాప్ లో, ఎస్టీడీ బూత్ లలో కూడా త‌ను పనిచేసినట్లు ప్రగతి తెలియ‌జేసింది.

కొద్ది రోజుల‌కి  యాడ్ లలో నటించే అవకాశం రావడం.. దానితో మోడలింగ్ లోకి అడుగుపెట్టినట్లు ప్రగతి  స్ప‌ష్టం చేసింది.. ఓ సందర్భంలో హీరో, నిర్మాత అయిన ఒకరు తనని చాలా ఇబ్బంది పెట్టినట్లు ప్రగతి  పేర్కొంది. అతడి వల్ల ఇండస్ట్రీ నుంచే వెళ్ళిపోదాం అని అనిపించింద‌ని త‌ను తెలియ‌జేసింది.. 20 ఏళ్లకే పెళ్లి చేసుకున్నా. కానీ భర్తతో విభేదాలు వచ్చి విడిపోయానని చెప్పిన ప్ర‌గ‌తి.. భవిష్యత్తులో మాత్రం పెళ్లి ఆలోచనే లేదని పేర్కొంది.

Related Articles

అలా చేయడానికి బాలయ్య రెడీ.. పవన్ ఒప్పుకుంటారా..!?

చిత్ర పరిశ్రమలో ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల వారసుల ఎంట్రీ మనం చూస్తూనే ఉన్నాం. మరీ...

మహేష్ – సాయి పల్లవి కాంబోలో మిస్సయిన బ్లాక్ బస్టర్ మూవీలు ఏమిటో తెలుసా..!

చిత్ర పరిశ్రమల్లో కొన్ని క్రేజీ కాంబినేషన్లు ఉంటాయి.. అలాంటి కాంబోలో మహేష్ – సాయి పల్లవి...

సినిమాల్లోకి రాక‌ముందు నాగ శౌర్య ఏం చేసేవాడు.. ఆ హీరోయిన్ల‌తో ఎఫైర్‌ నిజ‌మేనా..!?

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరోల్లో నాగ శౌర్య ఒక‌రు. ఊహలు గుసగుసలాడే సినిమాతో...

‘కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా’… ఈ డైలాగ్ బాల‌య్యది కాద‌ని తెలుసా..?

నందమూరి బాలకృష్ణ నటించిన ‘నరసింహనాయుడు’ చిత్రంలో ‘కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా’ అనే డైలాగ్‌...