Home Film News Priya Prakash: ప్రియా ప్ర‌కాశ్‌కి మ‌తి స్థిమితం లేదంటూ ద‌ర్శ‌కుడు ఫైర్..!
Film News

Priya Prakash: ప్రియా ప్ర‌కాశ్‌కి మ‌తి స్థిమితం లేదంటూ ద‌ర్శ‌కుడు ఫైర్..!

Priya Prakash: ఓవ‌ర్‌నైట్‌తో అంద‌రి హృద‌యాలలో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న అందాల ముద్దుగుమ్మ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్. మలయాళం లో ఒకే ఒక్క సినిమాతో సూపర్  క్రేజ్ దక్కించుకొని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది ఈ ముద్దుగుమ్మ‌. కేవలం మలయాళ ప్రేక్షకులు మాత్రమే కాదు అన్ని భాషల ప్రేక్షకులు కూడా ప్రియా ప్ర‌కాశ్‌కి ఫిదా అయ్యారు. . ఇప్పటికే మలయాళంలో స్టార్ హీరోయిన్‌గా అల‌రిస్తున్పో ఓ వెలుగు వెలుగుతున్న ప్రియా ప్రకాశ్  మలయాళ భాషతో పాటు తమిళ, తెలుగు సినిమాలు కూడా చేస్తోంది.  అయితే ప్రియా ప్ర‌కాశ్ కి మంచి హిట్ అనేది దొర‌క‌డం కాస్త ఇబ్బందిగా మారింది. అయితే ఇటీవ‌ల ఈ అమ్మ‌డు గ్లామ‌ర్ డోస్ పెంచి అందాల‌తో ర‌చ్చ చేస్తుంది.

సోష‌ల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర‌కారుకి పిచ్చెక్కిస్తుంది. బికినీలో పిక్స్ అయితే ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌సుల‌ని కొల్ల‌గొడుతున్నాయి. అయితే ప్రియా ప్ర‌కాశ్ న‌టించిన‌ ఓరు ఆధార్ లవ్ చిత్రంలోని వీడియో ఇంటర్ నెట్ లో ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో మ‌నంద‌రికి తెలిసిందే. కన్నుగీటిన వీడియోతో సృష్టించిన సంచలనం ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారింది. కన్నుగీటిన వీడియో క్రెడిట్ విషయంలో ప్రియా వారియర్.. ఆ చిత్ర దర్శకుడు ఒమర్ లులు రచ్చకెక్కి హాట్ టాపిక్ అయ్యారు.  ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రియా ప్ర‌కాశ్‌ వారియర్ మాట్లాడుతూ.. ఒరు ఆధార్ లవ్ చిత్రంలో దేశవ్యాప్తంగా వైరల్ అయిన కన్ను గీటిన వీడియో ఐడియా నాదే అంటూ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన కామెంట్స్ చేసింది.

ఈ వీడియోని చూసిన ‘ఓరు ఆధార్ లవ్’ దర్శకుడు ఓమర్ లూలూ  త‌న ఫేస్ బుక్ వేదికగా ప్రియా ప్రకాష్ వారియర్ పై తీవ్రస్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ‘‘పిచ్చి పిల్ల. ఆమెకి ఐదేళ్ల కింద ఏం జరిగిందో పాపం మర్చిపోయినట్టుంది. వలియ చందనాది.. జ్ఞాపకశక్తి మెరుగుపడ్డానికి ఈ తైలం ఎంత‌గానో ఉపయోగపడుతుంది’’ అంటూ ఆమెపై పలు వ్యంగ్యాస్త్రాలు సంధించాడు దర్శకుడు ఓమర్. అంతేకాకుండా వైరల్ వింక్ ఐడియా తన తోటి నటుడు రోషన్ దే అని  ఓరు ఆధార్ లవ్ ప్ర‌మోష‌న్ లో చెప్పిన మాట‌ల‌కి సంబంధించిన వీడియోని జ‌త చేశాడు. ప్ర‌స్తుతం ఈ ఇష్యూ హాట్ హాట్ గా న‌డుస్తుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...