Home Film News Niharika: నాగ‌బాబు నిహారిక‌ని దూరం పెట్టారా.. ఇందులో నిజ‌మెంత‌?
Film NewsGossips

Niharika: నాగ‌బాబు నిహారిక‌ని దూరం పెట్టారా.. ఇందులో నిజ‌మెంత‌?

Niharika: మెగా డాట‌ర్ నిహారిక ఇటీవ‌లి కాలంలో తెగ వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది. ముఖ్యంగా ఈమె విడాకుల విష‌యం నిత్యం హాట్ టాపిక్ అవుతూనే ఉంది. బుల్లితెరపై హోస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన అందాల ముద్దుగుమ్మ‌ నిహారిక.. ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. న‌టిగా నిహారిక‌కి మంచి గుర్తింపే ద‌క్కిన కూడా విజ‌యాలు అందుకోలేక‌పోయింది.  చైతన్య జొన్నలగడ్డతో పెళ్లి తర్వాత  కొంత యాక్టింగ్ కెరీర్‌కు బ్రేక్ ఇచ్చిన నిహారిక ఇప్పుడు న‌టిగా, నిర్మాత‌గా స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేస్తుంది. మ‌రోవైపు  ఫొటో షూట్స్‌తో రచ్చ చేస్తూ అల‌రిస్తుంది నిహారిక.. యూనిక్ ఫ్యాషన్‌తో కూడిన లేటెస్ట్ పిక్స్ ఇంటర్నెట్‌లో ర‌చ్చ చేస్తున్నాయి,

ఇటీవ‌ల నిహారిక సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవ్వడానికి ఎంత‌గానో ప్రయత్నిస్తోంది. ఇంకా చెప్పాలంటే  ఓవర్ గా అందాల డోస్ ఇస్తూ చ‌ర్చ‌నీయాంశంగా మారుతుంది. ముఖ్యంగా తన భర్త జొన్నలగడ్డ చైతన్య నుంచి విడాకులు తీసుకుంది అని  వార్తలు వస్తున్నప్పటి నుంచే ఇలా రెచ్చిపోయి అందాలు ఆర‌బోస్తుంది. జొన్నల గడ్డ చైతన్య తన ఇన్ స్టా నుంచి ఎప్పుడైతే త‌మ‌ పెండ్లి ఫొటోలు డిలీట్ చేసాడో అప్ప‌టి నుంచే  విడాకుల వార్తలు జోరు అందుకున్నాయి. నిహారిక ప్ర‌వ‌ర్త‌న‌లోను తేడా కనిపిస్తుందంట‌. ఈ క్ర‌మంలోనే నిహారికతో ఆమె తండ్రి నాగ‌బాబు మాట్లాడ‌టం లేద‌ని సమాచారం..  నాగ‌బాబు ఏరికోరి మ‌రీ చైత‌న్య‌ను త‌న ఇంటి అల్లుడిగా తెచ్చుకుంటే క‌నీసం నాలుగేళ్లు కూడా వీళ్ల కాపురం సాగ‌లేదు.

పెళ్లైన రెండేళ్ల‌కే వీరిద్ద‌రూ విడిపోవ‌డాన్ని నాగ‌బాబు ఏ మాత్రం జీర్ణించుకోలేక‌పోతున్నార‌ట‌. పైగా చైత‌న్య ఎంత సర్దుకుపోదామ‌ని ప్ర‌య‌త్నించినా.. నిహారిక మాత్రం మొండి వైఖ‌రితో వ్య‌వ‌హ‌రించ‌డం నాగ‌బాబుకు అస్స‌లు న‌చ్చ‌లేద‌ని అంటున్నారు.. అందుకే నిహారిక‌ను నాగ‌బాబు దూరం పెట్టాడ‌ని, ఆమెతో చాలా రోజుల నుంచి మాట్లాడ‌టం లేద‌ని, ఇంటికి కూడా రానివ్వ‌డం లేద‌ని ఏవేవో ప్ర‌చారాలు సాగుతున్నాయి. ఈ వార్త‌లలో నిజం లేద‌ని మెగా అభిమానులు అంటున్నారు.

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...