Home Film News Engagement: వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి నిశ్చితార్థం నేడే.. చ‌క్క‌ర్లు కొడుతున్న ఇన్విటేష‌న్‌
Film News

Engagement: వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి నిశ్చితార్థం నేడే.. చ‌క్క‌ర్లు కొడుతున్న ఇన్విటేష‌న్‌

Engagement: గ‌త కొద్ది రోజులుగా వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠిల ప్రేమ‌, పెళ్లికి సంబంధించి అనేక ప్ర‌చారాలు న‌డుస్తున్నా కూడా ఎవ‌రు దీనిపై స్పందించ‌డం లేదు. వ‌రుణ్ తేజ్ దీనిపై పూర్తిగా సైలెంట్‌గా ఉన్న‌ప్ప‌టికీ లావ‌ణ్య త్రిపాఠి అప్పుడ‌ప్పుడు ఖండిస్తూ వ‌చ్చింది. అయితే ఆ ప్ర‌చారాలే ఇప్పుడు నిజం కాబోతున్నాయి. ఈ రోజు వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య‌ త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌బోతున్న‌ట్టు వరుణ్‌ తేజ్‌ టీమ్‌ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ విష‌యం ఇప్పుడు ట్రెండ్‌ అవుతుంది. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని వరుణ్ తేజ్ ఇంట్లో వీరిద్దరి నిశ్చితార్థ వేడుక ఘ‌నంగా జ‌ర‌గ‌నుండ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి అత్యంత సన్నిహితులు, ఇరు కుటుంబ సభ్యులు హాజ‌రు కానున్నార‌ట‌.

ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు స‌న్నిహితుల‌ని కూడా వారు ఆహ్వానించిన‌ట్టు స‌మాచారం అందుతుంది. అల్లు అర్జున్ టూర్ ముగించుకొని రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో అడుగుపెట్టాడు. ఈ వేడుక‌ కోసమే కాస్త ముందుగా వ‌చ్చాడ‌ని చెబుతున్నారు. ఇక పుష్ప-2 షూటింగ్‌లో బిజీగా ఉన్న అల్లు అర్జున్‌ వరుణ్‌ ఎంగేజ్‌మెంట్ వేడుకకు హాజరకానున్నారని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసనలతో పాటు మెగా, అల్లు కుటుంబ సభ్యులు సైతం ఈ నిశ్చితార్థ వేడుక‌లో పాల్గొంటారు. ఇక ఏడాది లోపే వీరిద్దరి వివాహం ఉంటుంద‌ని స‌మాచారం.

 

వరుణ్ తేజ్ సోదరి నిహారిక, లావణ్య బెస్ట్ ఫ్రెండ్స్అనే విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రు కలిసి జిమ్ చేసేవారు. అలా నిహారిక ద్వారా వరుణ్-లావణ్య ఒకరికొకరు పరిచయమయ్యారని టాక్. కలిసి సినిమాల్లో నటించక ముందు నుండే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింద‌ని మిస్ట‌ర్ సినిమాతో మ‌రింత స్ట్రాంగ్ అయింద‌ని అంటున్నారు. లావ‌ణ్య త్రిపాఠి.. నిహారిక పెళ్లిలో సైతం సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే. మొత్తానికి వ‌రుణ్ తేజ్ ఓ ఇంటివాడు అవుతుండ‌డంతో అభిమానులు, సినీ సెల‌బ్రిటీలు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఇక వ‌రుణ్ తేజ్ ప్రస్తుత సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఆయన ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న `గాండీవధారి అర్జున` అనే చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీలో వరుణ్ తేజ్ కి జంటగా సాక్షి నటిస్తుంది. మిక్కీ జే మేయర్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు.

 

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...