Home Film News Theatres OTT: ఈ వారం థియేట‌ర్, ఓటీటీలో ర‌చ్చ చేయ‌నున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..!
Film News

Theatres OTT: ఈ వారం థియేట‌ర్, ఓటీటీలో ర‌చ్చ చేయ‌నున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..!

Theatres OTT: ప్ర‌తి వారం కూడా ప్రేక్ష‌కులకి మంచి వినోదం అందుతుంది. ఒక‌వైపు థియేట‌ర్స్‌లో, మ‌రోవైపు ఓటీటీలో ప్రేక్ష‌కుల‌కి కావ‌లసినంత వినోదం ద‌క్కుతుంది. తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల‌కి సంబంధించిన వెబ్ సిరీస్‌లు సైతం మంచి మ‌జాని అందిస్తున్నాయి. ఈ వారం ఓటీటీల్లోనూ పెద్ద ఎత్తున సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానుండ‌గా, అందులో  మాయా బజార్ అనే వెబ్ సిరీస్‌పై అంద‌రి దృష్టి ఉంది. ఇందులో  నవదీప్‌, ఇషారెబ్బా, నరేష్‌ , ఝాన్సీ తదితరులు నటించిన ఈ సిరీస్ జూలై14న జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఇక బెల్లంకొండ గ‌ణేష్ హీరోగా న‌టించిన నేను స్టూడెంట్ సార్ మూవీ ఆహా ఓటీటీలో జూలై 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో అవంతిక దాసానీ క‌థానాయిక‌గా న‌టించింది.

సోని లివ్‌లో టామ్ హోలాండ్‌, మార్క్‌వాల్‌బ‌ర్గ్ ప్ర‌ధాన పాత్ర పోషించిన  హాలీవుడ్ అడ్వెంచ‌ర‌స్ మూవీ అన్‌ఛార్ట‌డ్  జూలై 12 నుండి స్ట్రీమింగ్ కానుంది.  క్రైమ్ పెట్రోల్ 48 అవ‌ర్స్…జూలై 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో  ట్రాన్స్‌ఫార్మ‌ర్స్ ది రైజ్ ఆఫ్ బీస్ట్స్, ది స‌మ్మ‌ర్ ఐ ట‌ర్న్‌డ్ ప్రెట్టీ ( వెబ్‌సిరీస్‌) స్ట్రీమ్ కానున్నాయి.  నెట్‌ఫ్లిక్స్ లో అన్‌నౌన్ కిల్ల‌ర్ రోబోట్స్‌,  బ‌ర్డ్ బాక్స్ బార్సిలోనియా, కోహ్రా, అన్‌నౌన్ ది కేవ్ ఆఫ్ బోన్స్‌,  నైంటీన్ టూ ట్వంటీ (వెబ్‌సిరీస్‌), క్వార్ట‌ర్ బ్యాక్‌,  కింగ్ ఆఫ్ లాండ్‌, స‌ర్వైవ‌ల్ ఆఫ్ ది థికెస్ట్ స్ట్రీమింగ్ కానున్నాయి.

ఇక డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ లో  ది ట్ర‌య‌ల్ వెబ్‌సిరీస్‌, జాన‌కీ జానే స్ట్రీమింగ్ కానుండ‌గా, జియో సినిమాలో ది మ్యాజిక్ ఆఫ్ శ్రీ, ఇష్క్ ఈ నాద‌న్ స్ట్రీమ్ అవ్వ‌బోతున్నాయి. ఇక  ల‌య‌న్స్ గేట్ ప్లేలో వ్రాత్ ఆఫ్ మ్యాన్‌, అంటేబెల్లుమ్‌, లాస్ట్ ఛాన్స్ హార్వే స్ట్రీమింగ్‌కి  సిద్ధం అవుతున్నాయి. ఇక థియేట‌ర్ లో సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవిల బేబీ మూవీ, కోలీవుడ్ సూపర్‌ హిట్‌ మూవీ నాయకుడు (మామన్నన్‌), శివ కార్తికేయన్‌ మహా వీరుడు వంటి చిత్రాలు సంద‌డి చేయ‌బోతున్నాయి. మొత్తానికి ఈ వారం ప్రేక్ష‌కులకి మంచి మ‌జా అయితే దొర‌క‌నుంది.

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...