Home Film News Ananya Nagalla : పెద్దపులితో అనన్య అచ్చిక బుచ్చికలాడి అటవీశాఖ వారికి అప్పజెప్పాలంట!
Film News

Ananya Nagalla : పెద్దపులితో అనన్య అచ్చిక బుచ్చికలాడి అటవీశాఖ వారికి అప్పజెప్పాలంట!

Ananya Nagalla
Ananya Nagalla

Ananya Nagalla: ఈరోజుల్లో సోషల్ మీడియా వినియోగం, దానివల్ల జరిగే మంచి, చెడు పరిణామాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి పలు సామాజిక మాధ్యమాల వల్ల సెలబ్రిటీలకీ, సామాన్యులకీ (ఫ్యాన్స్‌కీ) మధ్య దూరం తగ్గిపోయింది.

సెలబ్స్ పోస్టులకి కామెంట్స్ చెయ్యడం, లైవ్‌లో మాట్లాడాలని అభిమానులు, నెటిజన్లు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సెలబ్స్‌కి వాళ్లు చేసే కొన్ని కామెంట్స్, అడిగే ప్రశ్నలు ఫన్నీగా అనిపిస్తే, మరికొన్ని చిరాకు తెప్పిస్తుంటాయి. గతంలో ఇలాంటి సంఘటనలు చాలానే చూశాం.

ఇప్పుడు బ్యూటిఫుల్ తెలుగు యాక్ట్రెస్ అనన్య నాగళ్లపై చేసిన ఫన్నీ మీమ్ ఒకటి బాగా వైరల్ అవుతోంది. అనన్య లేటెస్ట్ ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది. అలాగే ఇటీవల జూపార్క్‌కి వెళ్లినప్పుడు పులితో తీసుకున్న పిక్‌ని పోస్ట్ చేసింది.

ఇక మీమ్స్ రాయుళ్లకి వరద బాధితుడికి పులిహోర పొట్లం దొరికినట్టైంది. ఇటీవల కాలంలో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌లో పెద్దపులి ప్రజల్ని ఎంతలా కలవరపెడుతుందో తెలిసిందే. అనన్య ఆ పులి దగ్గరకి వెళ్లి.. దాన్ని మచ్చిక చేసుకుని, అచ్చిక బుచ్చికలాడి ఆ పులిని అటవీశాఖ వారికి అప్పజెప్పితే.. అక్కడి ప్రజలు సురక్షితంగా ఉంటారు.. ఆ జిల్లాలో ఆమె పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...