Home Film News Telugu Heroines: తెలుగమ్మాయిలని హీరోయిన్స్‌గా సెల‌క్ట్ చేయ‌క‌పోడంపై స్పందించిన తేజ‌
Film News

Telugu Heroines: తెలుగమ్మాయిలని హీరోయిన్స్‌గా సెల‌క్ట్ చేయ‌క‌పోడంపై స్పందించిన తేజ‌

Telugu Heroines: ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్ లో తేజ ఒక‌రు. ఆయ‌న తెర‌కెక్కించిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ షేక్ చేశాయి. చిత్రం, నువ్వు నేను, జ‌యం  వంటి చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయి అనేవి అంద‌రికి తెలిసిందే.  త్వ‌ర‌లో అహింసా అనే  చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని పల‌క‌రించ‌బోతున్నాడు తేజ‌.  నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు దగ్గుబాటి అభిరామ్ కథానాయకుడుగా నటిస్తున్న అహింస చిత్రం మ‌రి కొద్ది రోజుల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రమోషన్స్ లో పాల్గొన్న తేజ  ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియజేశారు. షకీలా క్రేజీ చూసి తాను ఒక్కసారిగా ఆశ్చర్యపోయానని  కూడా చెప్పుకొచ్చారు.

ఎంతోమంది నటీనటులు టెక్నీషియన్లు టాలీవుడ్ కి తాను ప‌రిచ‌యం చేశాన‌ని తేజ స్ప‌ష్టం చేశారు.  జూన్ 2న  తేజ తెర‌కెక్కించిన అహింస చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈక్రమంలోనే కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు తేజ‌. రీసెంట్‌గా  ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ.. నార్త్ అమ్మాయిలను హీరోయిన్లుగా సెలక్ట్ చేయడానికి గల కారణాలను  తెలియ‌జేశారు.  నా సినిమాల్లో తెలుగుమ్మాయిలనే హీరోయిన్లుగా పెట్టుకుందాం అని  ఎన్నో సార్లు అనుకున్నాను.  కొంతమంది హీరోయిన్స్ తో ఫొటో షూట్స్ కూడా చేశాను.. లుక్ టెస్ట్స్ చేయించాను. అయితే ఒకటే సమస్య ఏంటంటే తెలుగుమ్మాయిలకు ఓపిక తక్కువ అని తేజ అన్నారు.

వాళ్ళకు నేను హీరోయిన్ ఛాన్స్ ఇవ్వాలని ఎంత‌గానో ట్రై చేశాను. వారిని ఒక  6 నెలలు ఆగమని కూడా చెప్పాను.. కానీ వాళ్లు ఆగలేదు. వాళ్ల ఇంట్లో వాళ్లు తొందర పెట్టడం.. సోసైటీ కోసం భయపడటం వంటి కారణాల వ‌ల‌న ఏదో ఒక చిన్న క్యారెక్టర్స్ చేస్తుంటారు. నాకు రెండు, మూడు సార్లు ఇలానే జరిగింది. కేవలం అమ్మాయిలే కాదు.. తెలుగబ్బాయిలు కూడా ఇలానే చేస్తుంటారు అని తేజ ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొచ్చాడు. ఇక తేజ తెర‌కెక్కించిన  యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అహింస ‘ చిత్రాన్ని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌ పై పి.కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతికా తివారీ కథానాయికగా  ఈ  చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై చాలా ఆస‌క్తిని పెంచింది. మూవీ త‌ప్ప‌క హిట్ అవుతుందని సినీ ప్రేక్ష‌కులు భావిస్తున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...