Home Film News Allu Aravind: మహేష్ బాబు డైరెక్ట‌ర్‌కి ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చిన అల్లు అర‌వింద్..!
Film News

Allu Aravind: మహేష్ బాబు డైరెక్ట‌ర్‌కి ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చిన అల్లు అర‌వింద్..!

Allu Aravind: ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ ద‌ర్శ‌కుల‌లో అల్లు అర‌వింద్ ఒక‌రు. గీతా ఆర్ట్స్ బేన‌ర్‌లో ఆయ‌న ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాలు నిర్మించారు. ఇక ఇటీవ‌ల గీతా ఆర్ట్స్ 2ని కూడా స్థాపించి చిన్న సినిమాల‌ని సైతం నిర్మిస్తున్నారు. అలానే ఆహా అనే తెలుగు ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల‌కి ప‌సందైన వినోదం పంచుతున్నారు. అయితే అల్లు అర‌వింద్ ఎంత కామ్‌గా క‌నిపిస్తారో స‌మ‌యం సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు అంతే క‌ఠినంగా కూడా ఉంటారు. తాజాగా ఆయ‌న  సూటిగా సుతిమెత్తగా ఎవరిని టచ్‌ చేయాలో వారిపైనే పంచ్‌లేసి వార్త‌ల‌లోకి ఎక్కారు. మనిషన్నాక కాస్త మాట మీదుండాలి.. మాట తప్పితే మనిషి ఎలా అవుతాడని పరోక్షంగా ఓ డైరెక్టర్‌ను ఉద్దేశించి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు అల్లు అరవింద్.

టాప్ ప్రొడ్యూస‌ర్.. అల్లు అరవింద్ కు ఇంకా దర్శకుడు పరుశరామ్ మీద కోపం పోయినట్లు క‌నిపించ‌డం లేదు. రీసెంట్‌గా అర‌వింద్ ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు మరోసారి ఆయ‌న మ‌న‌సులో ఉన్న విష‌యం బ‌య‌ట‌ప‌డింది. . మలయాళ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘2018’ని తెలుగులో బన్నీ వాసు విడుదల చేయ‌గా, ఈ చిత్రం  తెలుగులోనూ మంచి విజ‌యం సాధించి భారీ వసూళ్లతో  దూసుకుపోతోంది. ఈ క్రమంలో చిత్రానికి సంబంధించి  థాంక్యూ మీట్ ని నిర్వహించగా, ఈ వేడుక‌కి అల్లు అరవింద్, చందు మొండేటి హాజరయ్యారు. ఈవెంట్‌లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. నేను నిర్మాతగా ఉంటూనే బన్నీవాసు లాంటి వాళ్ళని మరింతమందిని ఎంకరేజ్ చేస్తున్నాన‌ని చెప్పుకొచ్చారు.

అయితే  సినీ పరిశ్రమలో సీనియర్స్, మా జనరేషన్ జూనియర్స్ కి  కొంత స్పేస్ ఇవ్వాలి అని అన్నారు.   చందు మొండేటితో గతంలోనే సినిమా చేయాల‌ని అనుకున్నాం. త్వ‌ర‌లోనే చేస్తాం. అయితే  నేను పేరు చెప్పను కానీ ఇంకో దర్శకుడికి కూడా ఆఫర్ ఇవ్వ‌గా, అత‌డు  లేట్ అయింది అని వెళ్ళిపోయాడు. చందు మాత్రం ఇప్పటికీ అదే మాట మీద నిలబడి మా నిర్మాణంలో సినిమా చేస్తున్నాడు అని  చెప్పుకొచ్చారు. ఈమధ్య కొందరు   కమిట్మెంట్ ఇచ్చి గీత దాటి వెళ్లిపోయారు, వాళ్ళ గురించి నేను చెప్పటం లేదు, అని ఇన్ డైరెక్ట్‌గా దర్శకుడు పరశురామ్  గురించి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు అర‌వింద్. కాగా, గీతా గోవిదం వంటి సూపర్ హిట్ తర్వాత  పరశురామ్ గీత ఆర్ట్స్ కి సినిమా చేయాల్సి ఉండ‌గా, ఆయ‌న దిల్ రాజు కి సినిమా చేస్తున్న‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించాడు. ఈ క్ర‌మంలోనే అరవింద్ అలాంటి కామెంట్స్ చేసి ఉంటాడని అనుకుంటున్నారు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...