Home Film News ర‌కుల్ ప్రీత్ సింగ్‌కు కాబోయే భ‌ర్త జాకీ భగ్నానీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. జాకీ ఎన్ని కోట్ల‌కు వార‌సుడో తెలుసా?
Film NewsSpecial Looks

ర‌కుల్ ప్రీత్ సింగ్‌కు కాబోయే భ‌ర్త జాకీ భగ్నానీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. జాకీ ఎన్ని కోట్ల‌కు వార‌సుడో తెలుసా?

ఇటీవల కాలంలో సినిమా పరిశ్రమలో వరుసగా పెళ్లి భాజాలు మోగుతున్నాయి. సెలబ్రిటీలు తమ సింగిల్ లైఫ్ కు ఎండ్ కార్డు వేసి ప్రియమైన వారితో ఒకటవుతున్నారు. కొందరైతే ఎటువంటి ప్రకటన చెయ్యకుండా పెళ్లి చేసుకుని సర్ప్రైజ్ ఇస్తున్నారు. ఇకపోతే త్వరలోనే ఇండస్ట్రీలో మరోసారి వెడ్డింగ్ బెల్స్ మోగనున్నాయి. ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎట్టకేలకు ఓ ఇంటిది అయ్యేందుకు రెడీ అవుతోంది. బాలీవుడ్ నటుడు మరియు నిర్మాత జాకీ భగ్నానీతో ఏడడుగులు వేయబోతోంది. 2024 ఫిబ్రవరి 22న వీరి వివాహం జరుగబోతుందని పలు నివేదికలు చెబుతున్నాయి. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ కు కాబోయే భర్త జాకీ గురించి సౌత్ ఫాన్స్ ఆరాలు తీస్తున్నారు.

Amid Wedding Rumours, Rakul Preet Singh Gets Spotted With Boyfriend Jackky  Bhagnani For A Lunch Date

అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకునేందుకు ఆస‌క్తి చూపుతున్నారు.అయితే జాకీ భగ్నానీ కంటే ముందు రకుల్ ప్రీత్ సింగ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1990 అక్టోబర్ 10న ఢిల్లీలోని పంజాబీ సిక్కు కుటుంబంలో జన్మించిన రకుల్ ప్రీత్ సింగ్.. 18 ఏళ్ల వయసులోనే మోడలింగ్ లోకి ప్రవేశించింది. మిస్ ఇండియా అందాల పోటీల్లో ప్రజాభిప్రాయం ద్వారా మిస్ ఇండియా గా ఎంపికయింది. మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటెడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్ల‌ను అందుకుంది. 2009లో గిల్లి అనే కన్నడ మూవీతో హీరోయిన్ గా వెండితెర‌కు పరిచయమైంది. కెరటం తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

2013లో వచ్చిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రం రకుల్ కు టాలీవుడ్ లో మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత రకుల్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా ముద్ర వేయించుకుంది. అలాగే తమిళ్ చిత్రాల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకుల మెప్పు పొందిన రకుల్.. కొన్నాళ్ల నుంచి బాలీవుడ్ లో పాగా వేసేందుకు కష్టపడుతుంది. సౌత్ సినిమా ఆఫర్లను రిజెక్ట్ చేసి మరీ బ్యాక్ టు బ్యాక్ హిందీ చిత్రాల్లో నటిస్తోంది. ఇదే క్రమంలో జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది. రెండేళ్ల క్రితమే రకుల్ జాకీ తో తన రిలేషన్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అప్ప‌టి నుంచి వీరు ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారా అని అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

Jackky Bhagnani | Biography, Career, Age, Net worth, Movies

ఫైనల్ గా ఆ టైమ్‌ రానే వచ్చింది. మరి కొద్ది రోజుల్లో ఈ జంట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. మొద‌ట మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని రకుల్-జాకీ ప్లాన్ చేసుకున్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఇండియాలోనే చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సంపన్నులు మరియు సెలబ్రిటీలు తమ జీవితాల్లో ముఖ్యమైన ఈవెంట్లను విదేశాల్లో కాకుండా ఇండియా వేదికగా జరుపుకోవాలని మోదీ కోరారు ఈ కారణంగానే రకుల్ మరియు జాకీ వెడ్డింగ్ వెన్యూ ను గోవా గా మార్చుకున్నారు. ఇక జాకీ భగ్నానీ విషయానికి వస్తే.. 1984 డిసెంబర్ 25న పశ్చిమ బెంగాల్ లోని కోల్కతాలో సింధీ కుటుంబంలో అత‌ను జన్మించాడు. జాకీ తండ్రి వాషు భగ్నానీ బాలీవుడ్ లో ఫిలిం ప్రొడ్యూసర్ గా సత్తా చాటుతున్నారు. త‌ల్లి పూజీ భ‌గ్నానీ గృహిణి.

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి డేట్ ఫిక్స్? ప్రియుడితో  పెళ్లి ఆ రోజే.. | Rakul preet singh jackky bhagnani marriage rumours goes  viral in bollywood-10TV Telugu

జాకీ ముంబైలోని హెచ్‌ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి డిగ్రీ పట్టా పొందాడు. ఆ త‌ర్వాత‌ లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ మరియు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్సు పూర్తి చేసి ఇండ‌స్ట్రీ వైపు అడుగులు వేశాడు. కల్ కిస్నే దేఖా అనే మూవీతో 2009లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. 2011లో వ‌చ్చిన FALTU మూవీ జాకీకి బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ త‌ర్వాత అజబ్ గజబ్ లవ్, రంగేజ్, యంగిస్తాన్ త‌దిత‌ర చిత్రాల్లో న‌టించాడు. కానీ, అవేమి అత‌న్ని హీరోగా నిల‌బెట్ట‌లేక‌పోయాయి. దాంతో జాకీ నిర్మాణం వైపు మొగ్గు చూపాడు. 2016లో సర‌బ్జ‌త్ మూవీతో ప్రొడ్యూస‌ర్ గా మారాడు. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో.. జాకీ నిర్మాత‌గా సెటిల్ అయ్యాడు. హీరోగా స‌క్సెస్ కాలేక‌పోయినా.. జాకీ భ‌గ్నానీ నిర్మాత‌గా నిల‌దొక్కుకున్నాడు. ఇక ఆస్తుల విష‌యానికి వ‌స్తే.. తండ్రి వాషు నుంచి వ‌చ్చిన ఆస్తుల‌తో పాటు సినిమా ప‌రిశ్ర‌మ‌లో జాకీ కూడా భారీగానే సంపాదించాడు. ప‌లు నివేదిక‌ల ప్ర‌కారం.. జాకీ భ‌గ్నానీ దాదాపు రూ. 50 నుంచి 60 కోట్లు విలువ చేసే ఆస్తుల‌కు వార‌సుడ‌ని తెలుస్తోంది. ఇక మ‌రోవైపు ర‌కుల్ ఆస్తులు కూడా రూ. 40 కోట్ల‌కు పైగా ఉంటాయ‌ని అంటున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...