Home Film News Multi Starrer: మ‌నం లాంటి భారీ మ‌ల్టీ స్టార‌ర్ ప్లాన్ చేస్తున్న అక్కినేని ఫ్యామిలీ
Film News

Multi Starrer: మ‌నం లాంటి భారీ మ‌ల్టీ స్టార‌ర్ ప్లాన్ చేస్తున్న అక్కినేని ఫ్యామిలీ

Multi Starrer: తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో అక్కినేని ఫ్యామిలకి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. అక్కినేని నాగేశ్వ‌రావు త‌న న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు ఆయ‌న లెగ‌సీని నాగార్జున కొన‌సాగిస్తున్నారు. విభిన్న క‌థా చిత్రాలు చేసి టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు. ఇప్ప‌టికీ నాగ్ ప‌లు సినిమాలు చేస్తున్నా కూడా అవి స‌క్సెస్ ట్రాక్ ఎక్క‌లేకపోతున్నాయి. ఇక ఆయ‌న త‌న‌యులు అఖిల్, నాగ చైత‌న్య అయిన మంచి విజ‌యాలు సాధించి అక్కినేని ప్ర‌తిష్ట‌ని పెంచుతారు అనుకుంటే వారికి కూడా పెద్దగా సక్సెస్‌లు రావ‌డం లేదు. ఈ క్ర‌మంలో  చాలా మంది ప్రేక్ష‌కులు అక్కినేని కుటుంబం మీద   సానుభూతి చూపిస్తున్నారు

అక్కినేని ఫ్యామిలీలో ఇప్పుడు గ్రేడ్ వ‌న్ హీరో ఒక్క‌రు కూడా లేక‌పోవ‌డం అక్కినేని అభిమానుల‌ని ఎంత‌గానో బాధిస్తుంది. సుమంత్, సుశాంత్, చైతూ, అఖిల్‌, నాగార్జున వంద త‌మ సినిమాని వంద కోట్ల క్ల‌బ్‌లో నిల‌బెట్ట‌డానికి చాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కాని అవేవి వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే నాగార్జున మ‌నం స్టైల్‌లో ఓ భారీ మ‌ల్టీ స్టార‌ర్ చేయాల‌ని డిసైడ్ అవుతున్నాడ‌ట‌.  మ‌నం సినిమాతో అక్కినేని ఫ్యామిలీకి మెమోర‌బుల్ గిఫ్ట్ ఇచ్చిన విక్ర‌మ్ కుమార్ రీసెంట్‌గా నాగ్‌ని క‌లిసి ఓ క‌థ చెప్పాడ‌ట. ఆ క‌థ నాగ్‌కి న‌చ్చ‌డంతో ఆ ప్రాజెక్ట్‌కి వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని స‌మాచారం

అయితే విక్ర‌మ్ కుమార్‌కి మ‌నం త‌ర్వాత ఒక్క హిట్ లేదు. ఫేడ్ డైరెక్ట‌ర్స్‌లో ఆయ‌న కూడా ఒక‌రిగా ఉన్నారు. ఇప్పుడు విక్ర‌మ్‌తో సినిమా చేసి అక్కినేని హీరోలు మంచి హిట్ అందుకుంటారా అనేది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. త‌న కొడుకుల‌కి పెద్ద హిట్స్ రాక‌పోవ‌డంతో నాగార్జున ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టి మంచి హిట్ వారికి ఇవ్వాల‌ని చాలా క‌సిగా ఉన్నాడ‌ట. చూడాలి మ‌రి నాగార్జున ఎలాంటి ప్లాన్స్ తో త‌న కుమారుల‌ని స‌క్సెస్ ట్రాక్ ఎక్కిస్తాడో.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...