Home Film News Hansika: పెళ్ల‌య్యాక స‌ర్జ‌రీ చేయించుకున్న హన్సిక‌.. అందుకే పిల్ల‌ల్ని క‌న‌డం లేదా?
Film News

Hansika: పెళ్ల‌య్యాక స‌ర్జ‌రీ చేయించుకున్న హన్సిక‌.. అందుకే పిల్ల‌ల్ని క‌న‌డం లేదా?

Hansika: దేశ‌ముదురు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ హ‌న్సిక‌. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యం ఈ అమ్మ‌డి సొంతం. తెలుగులో ‘మస్కా’, ‘బిల్లా’, ‘కందిరీగ’ వంటి సినిమాలు చేసి టాలీవుడ్ ప్రేక్ష‌కులకి మ‌రింత ద‌గ్గ‌రైంది. దాదాపు కుర్రహీరోలందరితో కలిసి నటించిన ఈ అమ్మడు… తెలుగుతోపాటు తమిళ్ లోనూ , అలానే ప‌లు హిందీ సినిమాల‌లోనూ న‌టించింది. హ‌న్సికకి త‌మిళంలో వీరాభిమానులు ఉన్నారు. ఆమె కోసం ప్ర‌త్యేకంగా ఒక గుడి కూడా క‌ట్టారు. అయితే హ‌న్సిక ఇటీవ‌ల  పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ స‌త్తా చాటుతుంది.
హన్సిక‌కి సంబంధించి అప్పుడ‌ప్పుడు అనేక పుకార్లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. కొన్నింటికి హ‌న్సిక స్పందిస్తూ ఉంటుంది. మ‌రి కొన్నింటిని మాత్రం లైట్ తీసుకుంటుంది. హ‌న్సిక హార్మోనల్‌ ఇంజక్షన్స్‌తీసుకొని ఎనిమిదేళ్ల వయసులోనే  న‌టి అయింద‌ని, వాళ్ల  అమ్మ ఆమెకు  హార్మోనల్   ఇంజక్షన్స్‌ ఇచ్చి త్వరగా పెద్దదాన్ని చేసిందని త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేశారు. దానిపై హన్సిక ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక  హ‌న్సిక తల్లి మోనా మాట్లాడుతూ..   నిజంగా హన్సికకి ఇంజక్షన్స్ ఇచ్చి  ఉంటే క‌నుక టాటా, బిర్లా  కంటే ధనవంతురాలి  అయ్యే దానిని. ప్రతి ఒక్కరు త్వరగా పెర‌గ‌డానికి నా దగ్గరికివచ్చేవారు కదా.. ఇలా త‌ప్పుడు  ప్రచారాలు చేసేందుకు కనీసం కామన్ సెన్స్ ఉండాలి అని  హన్సిక తల్లి  మండిప‌డింది.
కాగా, హన్సిక మోత్వానీ..సొహైల్‌ కతూరియాతో గతేడాది డిసెంబర్‌ 4న అంగరంగ వైభవంగా వివాహం చేసుకోగా, వివాహం త‌ర్వాత హ‌న్సిక  చాలాగా సన్నబడిపోయింది. అయితే  పెళ్లయ్యాక  ఈ అమ్మ‌డు సన్నగా చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తోంది.  దీంతో కొంద‌రు బరువు తగ్గడానికి సర్జరీ చేయించుకుందని, అవకాశాల కోసమే అలా చేసిందని చెప్పుకొస్తున్నారు. మ‌రోవైపు సినిమాల్లో అవకాశాలు ఎక్కడ తగ్గిపోతాయో అనే ఉద్దేశంతో పిల్లల్ని కూడా కనడం లేదు అంటూ కొంద‌రు పుకార్లు పుట్టించారు. దీనిపై స్పందించిన హ‌న్సిక‌..  నేను ఎలాంటి సర్జరీ చేసుకోలేదు.. కానీ వెయిట్ తగ్గడానికి యోగ, వర్కౌట్లు చేస్తున్నాను అని తెలియ‌జేసింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...