Home Film News Jayam 20 Years : బ్లాక్ బస్టర్ ప్రేమ వి ‘జయం’ కి 20 ఏళ్లు
Film News

Jayam 20 Years : బ్లాక్ బస్టర్ ప్రేమ వి ‘జయం’ కి 20 ఏళ్లు

Jayam 20 Years
Jayam 20 Years

Jayam 20 Years: ఏ భాషలో అయినా లవ్ స్టోరీ మూవీస్‌కి ఉండే ప్రేక్షకాదరణే వేరు.. మన తెలుగు సినిమా పరిశ్రమలోనూ ఎవర్ గ్రీన్ క్లాసిక్ ప్రేమకథా చిత్రాలు చాలానే ఉన్నాయి.. ట్రెండ్, జనరేషన్ మారే కొద్దీ కాలానికి అనుగుణంగా ప్రేమాయణాలు తెరకెక్కించేవారు దర్శక, నిర్మాతలు.. అటువంటి ప్రేమ కథా చిత్రాల్లో ఒకటి ‘జయం’..

నితిన్, సదాలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ.. తేజ నిర్మించి, దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జయం’ 2002 జూన్ 14న రిలీజ్ అయ్యింది.. 2022 జూన్ 14 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది.. తేజ డైరెక్ట్ చేసిన ఫస్ట్ ఫిలిం, చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘చిత్రం’ పేరు వచ్చేలా ‘చిత్రం మూవీస్’ అనే బ్యానర్ పెట్టి, ‘జయం’ తో నిర్మాతగా మారారు.

రిలీజ్ ముందు పబ్లిసిటీ డిఫరెంట్‌గా చేశారు. గోడల మీద చేతి ముద్రతో వెంకట్ అని హీరో పేరు పెయింట్ వేసేవారు.. అప్పటికే ఆడియో సూపర్ హిట్ అవడం, ‘చిత్రం’, ‘నువ్వు నేను’ వంటి బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీస్ తీసిన తేజ డైరెక్టర్ కావడంతో హీరో హీరోయిన్లు కొత్త వాళ్లైనా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మౌత్ టాక్‌తో కొద్ది వారాల పాట థియేటర్ల బయట హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపించాయి.

మొదటి నెల రోజులు గంట ముందు వెళ్లినా టికెట్లు దొరుకుతాయని గ్యారంటీ లేని స్టార్లు లేని బ్లాక్ బస్టర్ సినిమాగా ట్రేడ్ వర్గాలు కొనియాడాయి. ఫలితంగా కలెక్షన్ల కనక వర్షం కురిసింది. ‘వెళ్లవయ్యా వెళ్లూ’ అంటూ సుజాత క్యారెక్టర్‌లో సదా చెప్పిన డైలాగ్ ఇప్పటికీ వినిస్తూనే ఉంది. వెంకట రమణ పాత్రలో నితిన్, విలన్‌గా గోపిచంద్ రోల్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి.

ఇక సమీర్ రెడ్డి విజువల్స్ మూవీని మరింత బ్యూటిఫుల్‌గా చూపించాయి. ఆర్.పి. పట్నాయక్ సాంగ్స్ సినిమాకి పెద్ద ఎసెట్. బిట్స్‌తో కలిపి మొత్తం 12 పాటలూ అలరిస్తాయి. హీరో హీరోయిన్ల కెరీర్‌కి పునాది వేసిన ఈ ‘జయం’ మూవీకి లవ్ స్టోరీస్‌లో ఎప్పుడూ స్పెషల్ ప్లేస్ ఉంటుంది. నేటితో నటుడిగా 20 ఏళ్లు కంప్లీట్ చేసుకుంటున్న తరుణంలో తేజతో సహా తను పని చేసిన దర్శక నిర్మాతలందరికీ థ్యాంక్స్ చెబుతూ నితిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...