Home Film News మాస్ స్టెప్పులతో దళపతికి విషెస్ చెప్పిన కీర్తి సురేష్!
Film News

మాస్ స్టెప్పులతో దళపతికి విషెస్ చెప్పిన కీర్తి సురేష్!

Keerti Suresh Mass Dance for Thapalapthy Vijay

మహానటిలో సినిమాలో తన నటనతో అదరగొట్టిన కీర్తి సురేష్ ఆ తర్వాత మరిన్ని సినీ అవకాశాలతో బిజీబిజీగా గడిపేసింది. కానీ, వాటిల్లో ఏవీ మహానటి కంటే గొప్ప సినిమాలు అని మాత్రం అనిపించుకోలేదు. మహానటి తనకి అంతటి ప్రత్యేకతని తెచ్చిపెట్టింది. ఆ సినిమా రేంజ్ లోనే పాపులర్ అవుతాయి అనుకున్న ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ వంటి సినిమాలు ఫ్లాప్ అయిపోయాయి.

సినిమాల్లో మాత్రమే కాకుండా, సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులకి రకరకాలుగా వినోదాన్ని పంచుతుంది కీర్తి. తనకి నచ్చిన వ్యక్తులకి తన టాలెంట్ తో విషెస్ చెప్తోంది. దళపతి విజయ్ కి తను అభిమానూరాలినని చెప్తుంది కీర్తి. గతేడాది అతని పుట్టిన రోజు సంధర్భంగా వీణ వాయించి అందర్నీ అబ్బురపరిచింది. ఈ సారి విజయ్ పుట్టిన రోజుకి మరింత సర్ప్రైస్ ఇచ్చింది. ఏకంగా మాస్ స్టెప్పులు వేస్తూ.. విజయ్ పై తనకున్న అభిమానాన్ని చాటుకుంది.

తన బ్రదర్ తో కలిసి చేసిన ఈ వీడియోలో విజయ్ వేసిన స్టెప్పుని అచ్చం అతని స్టైల్ లోనే వేస్తూ ట్విటర్ లో పోస్ట్ చేసింది. ‘మీరు పర్ఫార్మన్స్ లో మాత్రమే బెస్ట్ కాదు.. ఎంటర్టైన్ చేయడంలో బీస్ట్ కూడా..’ అంటూ విజయ్ నటిస్తోన్న దళపతి సినిమా పోస్టర్లని ఉద్దేశించి ట్వీట్ చేసింది కీర్తి సురేష్.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...