Home Film News Star Hero: దాని కోసం అండ‌ర్‌వేర్‌తో ప‌రిగెత్తాను అంటూ స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్
Film News

Star Hero: దాని కోసం అండ‌ర్‌వేర్‌తో ప‌రిగెత్తాను అంటూ స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్

Star Hero: రామ్ గోపాల్ వ‌ర్మ శిష్యుల‌లో ఒక‌రైన జేడీ చ‌క్ర‌వ‌ర్తి అప్ప‌ట్లో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. న‌టుడిగా.. సింగర్ గా..నిర్మాతగా.. ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నఆయ‌న గులాబీ,బొంబాయి ప్రియుడు, ప్రేమకు వేళాయరా, మనీ మనీ వంటి ఎన్నో సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించారు.. ఇక  సినిమాల్లో హీరోగా అవకాశాలు తగ్గాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కొన్ని సినిమాలు చేశారు. విల‌న్‌గా కూడా స‌త్తా చాటారు. 1989లో శివ సినిమాతో తన కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన  పాత్ర‌లు పోషించిన ఆయ‌న చాలా త‌ర్వాత ద‌య వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.

పాత్రలు పోషించాడు. తాజాగా దయ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్భంగా ఆయ‌న అనేక  విష‌యాల గురించి చెప్పుకొచ్చారు.  అస‌లు  సినిమా అంటే తనలో ఎలాంటి హుషారు వ‌స్తుంద‌నే దానికి ఒక ఉదాహ‌ర‌ణ చెప్పుకొచ్చారు. గులాబి సినిమా షూటింగ్ అప్పుడు కృష్ణ‌వంశీ నేను కారులో వెళుతున్నాం. ప్ర‌సాద్ ల్యాబ్ ఎదురుగా ఉన్న బ‌స్‌స్టాప్ ద‌గ్గ‌ర చాలా మంది జనాలు ఉన్నారు. అయితే అప్పుడు కృష్ణ వంశీ.. ఆర్టిస్ట్ ఎలా ఉండాలంటే.. చెప్ప‌గానే వెంటనే వెళ్లి ప్యాంట్ తీసి  అండర్ గార్మెంట్ మీద పరిగెత్తాలి అన్నాడు.  అయితే ఆ సమయంలో ఆయ‌న ఎవ‌రో  అండర్ గార్మెంట్ మీద వెళ్తున్నాడురా అని అంటూ నావైపు తిరిగాడు.

అయితే అలా ప‌రుగెత్తింది నేనే అని చెప్పాను.   ఒక పాయింట్ వంశీకి ప్రూవ్ చేయాల‌నే అలా  నేను ప్యాంట్ లేకుండా ప్రసాద్ ల్యాబ్ ఎదురుగా రోడ్డుపై పరిగెత్తాను. అలా చేశా కాబ‌ట్టి నాకు సిగ్గు లేద‌ని కాదు. ఆ ఎనర్జీని నేను ట్రాన్స్ ఫామ్ చేయాలి అనుకున్నాను. కృష్ణ వంశీ నాలో అది చూశాడు అంటూ జేడీ చక్రవర్తి కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఇక జేడీ చ‌క్ర‌వ‌ర్తి చాలా మంది హీరోయిన్స్‌తో ప్రేమ‌లో ప‌డ్డాడ‌ని ప్ర‌చారాలు సాగాయి. అయితే ఆయ‌న‌కు  తనతో నటించిన హీరోయిన్ల లో సౌందర్య, మహేశ్వరి, రంభ అంటే ఇష్ట‌మట‌. జెడి చక్రవర్తికి హీరోయిన్ రంభ  తో  ఎఫైర్ ఉన్నట్టు అప్ప‌ట్లో తెగ‌ వార్తలు వినిపించాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...