Home Film News Naresh: నరేష్ ఎవ‌రిని లేపాస్తావ్ అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్
Film News

Naresh: నరేష్ ఎవ‌రిని లేపాస్తావ్ అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్

Naresh: విజ‌య నిర్మ‌ల త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన న‌రేష్ హీరోగా మంచి సినిమాలే చేశాడు. అప్ప‌ట్లో న‌రేష్ సినిమాల‌కి మంచి ఆద‌ర‌ణ ఉండేది. ఇక రాను రాను ఆయ‌న హీరో నుండి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేయ‌డం మొద‌లు పెట్టారు. చిన్న హీరోల సినిమాల నుండి పెద్ద హీరోల సినిమాల‌లో న‌రేష్ త‌ప్ప‌క ఉంటున్నారు.  ఈ క్ర‌మంలో ఆస్తులు కూడా బాగానే వెన‌కేస్తున్నాడు. అయితే కెరీర్ ప‌రంగా న‌రేష్‌కి ఎలాంటి ఢోకా లేదు . కాని ప‌ర్స‌న‌ల్ లైఫ్ అత‌నిది గంద‌ర‌గోళంగా ఉంది. మూడు పెళ్లిళ్లు చేసుకున్న న‌రేష్ ప్ర‌స్తుతం ప‌విత్రా లోకేష్‌తో స‌హ‌జీవ‌నం చేస్తున్నాడు. అయితే మూడో భార్య‌కి విడాకులు ఇవ్వకుండా ప‌విత్రతో తిర‌గ‌డంపై ఇప్పుడు అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి.

నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి అత‌నిపై గ‌ట్టిగా ఫైట్ చేస్తుది. ఆయ‌న ఇటీవల న‌టించిన మ‌ళ్లీ పెళ్లి సినిమా రిలీజ్ ఆపేందుకు ప్ర‌య‌త్నం కూడా చేసింది. ఓటీటీలోకి కూడా రాకుండా విశ్వ ప్ర‌య‌త్నాలు చేసింది. కాని అది కుద‌ర‌లేదు. అయితే  న‌రేష్ ఇప్పుడు త‌న‌కు లైసెన్స్ గ‌న్ కావాల‌ని కోరడం హాట్ టాపిక్‌గా మారింది.  శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్, ఎస్పీ మాధవరెడ్డిని  క‌లిసిన న‌రేష్‌.. తనకు తుపాకీ లైసెన్స్‌ ఇవ్వాలని కోరారు.. . తనకు హాని ఉందని.. స్వీయరక్షణ కోసమే లైసెన్స్ గ‌న్ కావాల‌ని న‌రేష్ ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్టు తెలుస్తుంది. తాను నక్సల్స్‌ హిట్‌ లిస్టులో ఉండడంతో తనకు 2008లో గన్‌ లైసెన్సు మంజూరు చేశారని.. దానికి అనుమతి ఇవ్వాలని గతంలోనే న‌రేష్ కోరిన‌ట్టు తెలిపారు.

న‌రేష్ ఇచ్చిన ద‌ర‌ఖాస్తుని స్వీక‌రించిన  ఎస్పీ.. ఉన్నతాధికారులకు పంపుతామని తెలిపారు. కాగా న‌రేష్ లైసెన్స్ డ్ గ‌న్ కోర‌డంపై  ప‌లువురు నెటిజ‌న్స్ వెరైటీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొద్ది రోజులుగా న‌రేష్ ఏమో విడాకులు కావాలని, వద్దని ర‌మ్య ర‌ఘుప‌తి కోర్టులో వాదులాడుతున్నారు. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు తీవ్ర‌మైన‌ ఆరోపణలు కూడా  చేసుకుంటున్నారు. నరేష్ ఉమనైజర్, నీలి చిత్రాలు చూస్తాడంటూ రమ్య మీడియా ముఖంగా  ధ్వజమెత్తిన విష‌యం తెలిసిందే.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...