Home Film News Balayya: చిరంజీవి న‌టించిన ఆ సినిమా బాల‌య్య‌కి అంత ఇష్ట‌మా..ఏకంగా 20 సార్లు చూశాడ‌ట‌..!
Film News

Balayya: చిరంజీవి న‌టించిన ఆ సినిమా బాల‌య్య‌కి అంత ఇష్ట‌మా..ఏకంగా 20 సార్లు చూశాడ‌ట‌..!

Balayya: టాలీవుడ్ సీనియ‌ర్ హీరోల‌లో స్టార్స్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారు చిరంజీవి, బాల‌కృష్ణ‌. వీరిద్దరి వ‌య‌స్సు ఆరు ప‌దులు దాటిన కూడా కుర్ర హీరోల‌కి పోటీగా సినిమాలు చేస్తున్నారు. బాల‌య్య మాస్ సినిమాల‌తో అల‌రిస్తుండ‌గా, చిరంజీవి సామాజిక అంశాల నేప‌థ్యంలో చిత్రాలు చేస్తున్నారు. ఒక‌ప్పుడు ఈ ఇద్దరు హీరోల మ‌ధ్య విప‌రీత‌మైన పోటీ ఉండేది. సంక్రాంతి బరిలో వీరిద్ద‌రు ప‌లుమార్లు పోటీ ప‌డగా, బాల‌య్య‌నే ఎక్కువ శాతం విజ‌యం వ‌రించింది.ఇక వీరిద్ద‌రు వ్య‌క్తిగ‌తంగా మంచి స్నేహితులు. అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు సాయం కూడా చేసుకుంటారు. బాల‌కృష్ణ వందో సినిమా గౌత‌మి ఫుత్ర శాత‌క‌ర్ణి సినిమా ఈవెంట్‌కి చిరంజీవిని బాలయ్య ఆహ్వానించ‌గా ఒక్క క్ష‌ణం ఆలోచించ‌కుండా వ‌స్తాన‌ని మాట ఇచ్చాడు చిరు.

ఇక ఈవెంట్‌లో చిరు, బాల‌య్యల సంద‌డి ఏ రేంజ్‌లో ఉందో మ‌నం చూశాం. ఇక ఇదిలా ఉంటే ఈ ఏడాది  సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ తో  బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ తో పోటీ పడ్డారు. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించిన రెండు చిత్రాలు కూడా మంచి విజ‌యం సాధించాయి. బాక్సఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్లే రాబ‌ట్టాయి. ఇప్ప‌టి వ‌ర‌కు వీరిద్ద‌రు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర 15 సార్లు పోటీ ప‌డ్డారు. అయితే బాలయ్య బాబు చిరంజీవితో  పోటా ప‌డ్డా కూడా ఆయ‌న సినిమాల‌పై ఎంతో ఇష్టం  చూపిస్తారు. చిరంజీవి న‌టించిన   ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ అంటే బాల‌య్య‌కి చాలా ఇష్ట‌మ‌ట‌. సోషియా ఫాంట‌నీ నేప‌థ్యంలో రూపొందిన‌ఈ సినిమాని బాలయ్య బాబు కనీసం 20 సార్లు అయినా చూసి ఉంటాడ‌ట‌. ఈ విష‌యాన్ని బాల‌య్యే స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీ చిరస్థాయిగా ఈ చిత్రాన్ని గుర్తించుకోవ‌చ్చు అని బాలయ్య ఓ సంద‌ర్భంలో అన్నారు. చిత్రంలో చిరంజీవి న‌ట‌న‌, శ్రీదేవి అందం, సెట్టింగ్స్ ,పాట‌లు ఇలా ప్ర‌తి ఒక్క‌టి కూడా త‌న‌కి ఎంతగానో న‌చ్చాయ‌ని బాల‌య్య చెప్పుకొచ్చారు. చిరంజీవి సినిమా గురించి బాల‌య్య ఇంతలా గొప్ప‌గా చెప్ప‌డంతో మెగా అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. ఇక బాల‌య్య ప్ర‌స్తుతం త‌న 108వ సినిమాతో బిజీగా ఉండ‌గా, చిరంజీవి భోళా శంకర్ అనే చిత్రం చేస్తున్నాడు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...