Home Film News Project K: ప్ర‌భాస్ అభిమానుల‌కి కిక్కిచ్చే న్యూస్.. అంత‌ర్జాతీయ వేదిక‌పై టైటిల్ రివీల్
Film News

Project K: ప్ర‌భాస్ అభిమానుల‌కి కిక్కిచ్చే న్యూస్.. అంత‌ర్జాతీయ వేదిక‌పై టైటిల్ రివీల్

Project K: రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ప్రాజెక్ట్ కె ఒక‌టి.  భారీ బ‌డ్జెట్‌తో,  పెద్ద పెద్ద ఆర్టిస్ట్‌ల‌తో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. చిత్రానికి సంబంధించి  విడుదల అయిన  పోస్టర్లు, మేకింగ్ వీడియోస్ ప్రేక్షకుల్లో చాలా క్యూరియాసిటీ పెంచేశాయి. ఇక అభిమానుల‌కి మ‌రింత కిక్కిచ్చే న్యూస్ ఒక‌టి ఇప్పుడు బ‌య‌ట‌కు వచ్చింది. జూలై 19న‌
‘ప్రాజెక్ట్-కె’ మూవీ టైటిల్‌ను అంతర్జాతీయ వేదికపై గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. అమెరికాలోని శాన్ డియాగోలో కామిక్ కాన్ వేడుకలు జూన్ 19 నుండి జ‌ర‌గ‌నుండ‌గా, 20న ప్రాజెక్ట్ కె టైటిల్‌తో పాటు గ్లింప్స్ రిలీజ్ చేయ‌నున్నార‌ట‌.

అంత‌ర్జాతీయ‌త వేదిక‌పై ప్ర‌భాస్ సినిమా గ్లింప్స్ విడుద‌ల కానుండ‌డంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక ఈ ఈవెంట్‌కి హీరో  ప్రభాస్‌తోపాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత అశ్వినీదత్ త‌దిత‌రులు పాల్గొన‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. ఆదిపురుష్‌తో ప్ర‌భాస్ అభిమానులు కాస్త నిరాశ‌లో ఉండ‌గా, రీసెంట్‌గా రిలీజైన సలార్ టీజ‌ర్ వారికి ఎన‌లేని ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇక జూన్ 20న  ‘ప్రాజెక్ట్-కె’ గ్లింప్స్ కూడా వస్తుందని తెలియడంతో ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. చిత్రంలో అమితాబ్, క‌మ‌ల్ వంటి విశ్వ నటులు కూడా ఉండ‌డంతో ఈ మూవీ హాలీవుడ్ స్థాయి చేరుకుంటుంద‌ని విశ్వ‌సిస్తున్నారు.

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాగా ‘ప్రాజెక్ట్ కె  చిత్రాన్ని  వైజయంతి మూవీస్ వారు నిర్మిస్తున్నారు.  చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ‘ప్రాజెక్ట్ కె’ చిత్రీకరణ దాదాపు 70 శాతం పూర్తి అయిన‌ట్టు తెలుస్తుండ‌గా,  కమల్ హాసన్, ప్రభాస్ మధ్య సన్నివేశాలు మాత్రమే  మిగిలి ఉన్నాయ‌ని అంటున్నారు.  అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ సీన్స్ మ‌రో ప‌ది రోజుల‌లో పూర్తి కానున్నాయ‌నే టాక్ కూడా వినిపిస్తుంది. వీలైనంత త్వ‌ర‌గా సినిమాని పూర్తి చేసి వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ప్లాన్ చేస్తున్నార‌ట.స‌లార్ మాదిరాగానే ఈ చిత్రం కూడా  రెండు భాగాలుగా విడుదలకానున్నట్లు సమాచారం. సైన్స్ ఫిక్షన్ ఫ్రాంచైజీ తొలి భాగం కమల్ తో పోరాడేందుకు భవిష్యత్తులోకి ప్రయాణించేందుకు ప్రభాస్‌ సిద్ధం కావడంతో ముగుస్తుంది. ఫ్రాంచైజీ 2వ భాగం పూర్తిగా ప్రభాస్, కమల్ హాసన్ మధ్యే క‌థ‌ నడవనున్నట్లు చెబుతున్నారు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...