Home Film News Hero: షూటింగ్‌లో యువ హీరోకి తీవ్ర గాయాలు.. ఇప్పుడు ఆయ‌న ప‌రిస్థితి ఎలా ఉంది..!
Film News

Hero: షూటింగ్‌లో యువ హీరోకి తీవ్ర గాయాలు.. ఇప్పుడు ఆయ‌న ప‌రిస్థితి ఎలా ఉంది..!

Hero: ఇటీవ‌ల చాలా మంది హీరోలు షూటింగ్స్ లో స్టంట్స్ చేస్తూ ప్ర‌మాదాల బారిన ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఒక‌ప్పుడు రిస్కీ స్టంట్స్‌కి డూప్స్ ఉప‌యోగించేవారు. కాని ఇప్పుడు హీరోలే స్వ‌యంగా చేస్తూ ప్ర‌మాదాల బారిన‌ప‌డుతున్నారు. త‌మిళ హీరో విశాల్ ఇటీవ‌లి కాలంలో చాలా సార్లు ఇలా ప్రమాదానికి గుర‌య్యాడు. ఇక ఇప్పుడు యువ హీరో వ‌రుణ్ సందేశ్ షూటింగ్ లో గాయ‌ప‌డ్డ‌ట్టు తెలుస్తుంది.  హ్యాపీడేస్ అనే చిత్రంతో  టాలీవుడ్ కు హీరోగా  పరిచయం అయిన వరుణ్ సందేశ్.. త‌న కెరీర్‌లో మంచి చిత్రాలే చేశాడు. అయితే కొన్ని చిత్రాలు నిరాశ‌ప‌రుస్తున్న నేప‌థ్యంలో  సహనటి వితికాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి జంటగా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి సంద‌డి కూడా చేశారు.

ఇప్పుడు వ‌రుణ్ సందేశ్  ది కానిస్టేబుల్ అనే చిత్రంలో న‌టిస్తున్నారు.ప్ర‌స్తుతం ఈ చిత్రం  షూటింగ్‌ దశలో ఉంది. అయితే చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలో  వరుణ్ సందేశ్‌కు అనుకోకుండా గాయాలయ్యాయి. ఆయ‌న కాలుకు బలమైన గాయం కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. వరుణ్ సందేశ్‌ను పరీక్షించిన డాక్టర్లు మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తుంది. వ‌రుణ్ గాయ‌ప‌డ‌డంతో  ది కానిస్టేబుల్‌ షూటింగ్ నిలిచిపోయింది. ఈ ఏడాది సందీప్ కిషన్ హీరోగా నటించిన మైఖేల్‌ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించాడు వరుణ్ సందేశ్‌. ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్ అల్లుడు చిత్రంలో గెస్ట్‌ రోల్‌లో మెరిసి అలరించాడు.

ఇక ఇప్పుడు  వ‌రుణ్ సందేశ్‌ ది కానిస్టేబుల్‌తో పాటు యద్భావం తద్భవతి అనే చిత్రంలో నటిస్తున్నాడు. ది కానిస్టేబుల్ చిత్రాన్ని ఆర్య‌న్ శుభాన్ తెర‌కెక్కిస్తుండ‌గా, ఈ చిత్రాన్ని  పూర్తిగా పల్లెటూరి వాతావరణం లో నిర్మిస్తున్నారు. చిత్రం  ఒక కానిస్టేబుల్ జీవిత కథ చుట్టూ తిరుగుతుందని,  ఇప్పటికే నలభై శాతం పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్ హీరో వరుణ్ సందేశ్ కోలుకున్న తర్వాత మొదలవుతుందని నిర్మాత బలగం జగదీష్ స్ప‌ష్టం చేశారు. ఈ సినిమా అయిన వ‌రుణ్‌కి మంచి విజ‌యం అందించాల‌ని
అభిమానులు కోరుకుంటున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...