Home Film News Balayya: బిగ్ బాస్ హోస్ట్‌ కోసం బాలయ్య అంత రెమ్యున‌రేష‌న్ అడిగారా..!
Film News

Balayya: బిగ్ బాస్ హోస్ట్‌ కోసం బాలయ్య అంత రెమ్యున‌రేష‌న్ అడిగారా..!

Balayya: తెలుగు బుల్లితెర‌పై ప్ర‌భంజ‌నం సృష్టించిన రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్య‌క్ర‌మం స‌క్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతుంది. అయితే మొద‌ట్లో ఈ షోకి మంచి ఆద‌ర‌ణే ద‌క్కిన‌ప్ప‌టికీ రాను రాను క్రేజ్ త‌గ్గుతూ పోతుంది.గ‌త సీజ‌న్ అయితే చాలా చెత్త‌గా ఉందంటూ ప‌లువురు విమ‌ర్శ‌లు చేశారు. ఆడియ‌న్స్ కూడా చాలా అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అందుకు కార‌ణం కంటెస్టెంట్స్ అంద‌రు కూడా సాదా సీదా ఆర్టిస్ట్‌లు కావ‌డం,  హోస్ట్ నాగార్జున కూడా  సరిగా చేయలేదనే కామెంట్లు బలంగా వినిపించాయి.  ఈ క్ర‌మంలోనే 7వ సీజన్ లో అలాంటి తప్పులు లేకుండా, కంటెస్టెంట్స్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోనున్న‌ట్టు తెలుస్తుంది.

తాజా సీజ‌న్ కోసం సెల‌క్ట్ చేసిన వాళ్లంద‌రు కూడా  అందరూ కూడా తెలుగు ప్రజలకు బాగా సుపరిచితమైన వాళ్ళే ఉంటారట. ప్ర‌స్తుతానికి అయితే పాపుల‌ర్ స్టార్స్ కంటెస్టెంట్స్ లిస్ట్ సోషల్ మీడియా లో ప్రచారం అవుతుంది కాని,అది అధికారికంగా వచ్చింది కాదు.ఇక హోస్ట్ విష‌యానికి వ‌స్తే ఈ సీజ‌న్ కోసం ప‌లువురు పేర్లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. ముందు నాగార్జున స్థానంలో రానా పేరు బలంగా వినిపించింది. ఆ తర్వాత విజయ్‌ దేవరకొండ  అన్నారు. రౌడీబాయ్‌ హోస్ట్ గా చేస్తే మంచి కిక్ ఉంటుంద‌ని అన్నారు. ఇక ఆ త‌ర్వాత  బాలయ్య పేరు హోస్ట్ గా వినిపించింది. బాలకృష్ణ `ఆహా`లో చేసిన `అన్‌స్టాపబుల్‌` షోకి  మంచి రెస్పాన్స్ రావ‌డంతో ఆయ‌న బిగ్ బాస్ హోస్ట్ చేస్తే బాగుంటుందని కొంద‌రు చెప్పుకొచ్చారు.

బాల‌య్య  గతంలో ఎప్పుడూ టీవీ షోలో కనిపించ‌క‌పోవ‌డంతో ఈ సారి బిగ్ బాస్ షోకి హోస్ట్ చేయాలంటూ చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. నిర్వాహ‌కులు కూడా బాల‌య్య‌తో సంప్ర‌దింపులు జ‌ర‌ప‌గా, ఆయ‌న కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. ఒక్కో ఎపిసోడ్ కి ఆయన పారితోషికంగా 10 కోట్ల రూపాయిలు  డిమాండ్ చేశార‌ట‌. అక్కినేని నాగార్జున అయితే ఒక్కో ఎపిసోడ్ కి దాదాపుగా మూడు కోట్ల రూపాయిలు తీసుకునే వాళ్లు. బాల్లయ్య ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేయ‌డంతో నిర్వాహ‌కులు నాగార్జున‌తోనే షోని ర‌న్ చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.

Related Articles

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...

బాలయ్య లైఫ్ లోనే మర్చిపోలేని పీడ కల .. ఎన్ని సంవత్సరాలు మ‌రీన‌ మాయని గాయం ఇదే..!

టాలీవుడ్‌లోనే నంద‌మూరీ బాలకృష్ణకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో...

25 లక్షల కోసం ఆ ‘పొలిటీషియన్’తో అంటూ అనుచిత వ్యాఖ్యలు.. “పోరంబోకు వెధవ”.. కోపంతో రెచ్చిపోయిన త్రిష!

ఈ రీసెంట్ టైమ్స్ లో చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్లపై చీప్ కామెంట్స్ వల్గర్ గా...

చివరికి నాగచైతన్య పరిస్థితి ఏంటి ఇలా తయారయ్యింది… సమంత చెప్పినట్లే అయిందిగా..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఎలాంటి ప్రత్యేకత ఉందో అందరికీ తెలిసిందే..నట సామ్రాట్...