Home Film News Vijay Devarakonda: ఎట్ట‌కేల‌కు ఒకింటి వాడు కాబోతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఆయ‌న‌కి కాబోయే శ్రీమ‌తి ఎవ‌రంటే..!
Film News

Vijay Devarakonda: ఎట్ట‌కేల‌కు ఒకింటి వాడు కాబోతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఆయ‌న‌కి కాబోయే శ్రీమ‌తి ఎవ‌రంటే..!

Vijay Devarakonda: టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో అద‌రగొట్టిన విజ‌య్ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. గ‌త కొన్నాళ్లుగా హిట్స్ లేక స‌త‌మ‌తం అవుతున్నాడు.  త్వరలోనే ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఖుషీ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో తన అభిమానులను ఎంతో ఉత్సాహ‌ప‌రిచే ప్ర‌యత్నం చేస్తున్నాడు. ఖుషి సినిమాపై భారీ అంచనాలు పెంచుతూ ప్ర‌మోషన్స్ చేస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ  సెప్టెంబర్ 1వ తేదీన మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఖుషి లాంటి వార్తను సోషల్ మీడియా స్టోరీలో పోస్ట్ చేసి అంద‌రిలో అనేక అనుమానాలు క‌లిగించాడు. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ ఇన్‌స్టా స్టోరీ నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తుంది.

టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో విజయ్ దేవరకొండ  ఒక‌రు కాగా, ఆయ‌న  పెళ్లి వార్త కోసం ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. గ‌త కొన్నాళ్లుగా ఆయ‌న ర‌ష్మికతో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నారు. వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో న‌డుస్తుంద‌ని జ‌నాలు భావిస్తున్నా, అవ‌న్నీ అవాస్త‌వాలు అని కొట్టిపారేస్తున్నారు. అయితే విజ‌య్ తన లవ్ లైఫ్ గురించి ఎప్పుడు చెప్తాడా అని  అంద‌రు వేచి చూస్తున్న స‌మ‌యంలో త‌న ఇన్‌స్టా స్టోరీలో ఆస‌క్తికర పోస్ట్ పెట్టాడు.  ‘చాలా జరుగుతాయి.. కానీ, ఒకటి మాత్రం చాలా ప్రత్యేకమైనది – త్వరలోనే ప్రకటిస్తా’ అంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న ఇన్‌స్టా స్టోరీలో తెలియ‌జేశాడు.

ఫొటోలో   విజయ్ దేవరకొండ చేయి మరొకరి చేతిలో ఉండ‌గా, ఇది అచ్చం రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ సినిమా పోస్ట‌ర్ మాదిరిగానే ఉంది. ఈ పోస్టర్ చూసి త్వ‌ర‌లోనే విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న ల‌వ్ గురించి ప్ర‌క‌టిస్తాడని, ఆ అమ్మాయి ర‌ష్మిక‌నే అయి ఉంటుంద‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు.  మ‌రి కొంద‌రు ఇది సినిమా ప్ర‌మోష‌న్ అయి ఉండొచ్చని చెప్పుకొస్తున్నారు. ఇంకొందరు అయితే వెటకారంగా వాచ్ యాడ్ అయ్యుండొచ్చని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. అతి త్వ‌ర‌లోనే వీటిపై ఓ క్లారిటీ అయితే రానుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...