Home Film News Star Heroine: లిప్ లాక్‌తో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్.. ప్రియుడితో తెగ చెట్టాప‌ట్టాలు
Film News

Star Heroine: లిప్ లాక్‌తో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్.. ప్రియుడితో తెగ చెట్టాప‌ట్టాలు

Star Heroine: ఇటీవ‌ల అందాల ముద్దుగుమ్మ‌లు త‌మ ప్రియుడితో చేసే ర‌చ్చకి ప్ర‌తి ఒక్క‌రు నోరెళ్ల‌పెడుతున్నారు. ప‌బ్లిక్‌లో వారు చేసే హంగామాకి ఔరా అంటున్నారు. బాలీవుడ్ బ్యూటీ అమీ జాక్స‌న్ చాలా బోల్డ్‌గా ఉంటుంది. ఆమె సోష‌ల్ మీడియాలో చేసే సంద‌డికి ప్ర‌తి ఒక్కరు ఫిదా అవుతుంటారు. ఈ  అందాల భామ 2015 నుంచి బ్రిటన్ బిజినెస్ మ్యాన్ ఆండ్రియాస్ పనయియోటౌ కుమారుడు అయిన జార్జ్ పనయిటౌతో డేటింగ్ చేసింది. ఇక కొద్ది రోజుల‌కి ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకొని పెళ్లి కాకుండా ప్ర‌గ్నెంట్ అయిన‌ట్టు ప్ర‌క‌టించింది. ఇక  2019 సెప్టెంబర్ లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన జాక్సన్.. కుమారుడి పిక్స్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఇక 2022 లో జార్జ్ తో బ్రేకప్ చేసుకున్న ఈ అమ్మ‌డు ఎడ్ వెస్ట్‌ విక్‌ తో డేటింగ్ ప్రారంభించింది.

ఇక రీసెంట్‌గా త‌న ప్రియుడితో కిసి ముంబై వ‌చ్చిన ఈ బ్యూటీ అక్క‌డి ప్రాంతాల‌న్నింటిని చుట్టేస్తుంది. వీరు ఇద్ద‌రు   ఐకానిక్ ప్రదేశాలను సందర్శిస్తూ, ఎప్పటికప్పుడు ఆ ఫోటోలు.. వాటికి సంబంధించిన విషయాలు సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంటున్నారు.   ముంబయ్ లోని గేట్ వే ఆఫ్ ఇండియా తో పాటు తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌ లో తీసుకున్న ఫోటోలను తాజాగా పంచుకోగా, ఇందులో ఇద్ద‌రు లిప్ లాక్స్ తో రెచ్చిపోయారు. ప‌బ్లిక్ లో వీరు చేసిన ప‌నికి ప్ర‌తి ఒక్క‌రు తిట్టిపోస్తున్నారు.  ఏది ఏమైన మాత్రం వీరి పిక్స్ మాత్రం సోష‌ళ్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

అమీ జాక్స‌న్ విష‌యానికి వ‌స్తే… మదరాసిపట్నం  అనే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఈ భామ హిందీలో ఏక్ దివానా థా’ మూవీతో బాలీవుడ్ లోఅడుగుపెట్టింది. ఇక  రామ్‌ చరణ్‌ ‘ఎవడు’ సినిమాలో టాలీవుడ్‌ కు పరిచయమైంది.శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఐ సినిమాలో విక్రమ్ జోడీగా న‌టించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించింది.  తమిళంలో వ‌రుస సినిమాలు చేస్తూ సంద‌డి చేసిన అమీ జాక్స‌న్.. రజనీకాంత్ తో రోబో 2.O లో కీరోల్ చేసి అద‌ర‌గొట్టింది. అయితే ఎన్ని సినిమాలు చేసిన అమీ మాత్రం స్టార్‌డం ద‌క్కించుకోలేక‌పోయింది. దాదాపు ఐదేళ్ల త‌ర్వాత  ‘మిషన్ చాప్టర్ 1’ అనే తమిళ్ మూవీలో అరుణ్ విజయ్ తో కలసి సంద‌డి చేయ‌నుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...