Home Film News Varuntej-Lavanya: వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి ఆగ‌స్ట్‌లో కాదు.. ఇది ప‌క్కా డేట్..!
Film News

Varuntej-Lavanya: వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి ఆగ‌స్ట్‌లో కాదు.. ఇది ప‌క్కా డేట్..!

Varuntej-Lavanya: త్వ‌ర‌లో మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి బాజాలు మోగ‌నున్న విష‌యం తెలిసిందే. కొన్నాళ్లుగా ప్రేమ‌లో మునిగి తేలిన వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి జంట జూన్ 9న స‌న్నిహితులు, శ్రేయోభిలాషుల స‌మ‌క్షంలో నిశ్చితార్థం జ‌రుపుకున్నాడు. ఇక వీరి పెళ్లి ఎప్పుడు జ‌రుగుతుందా అని ఇండ‌స్ట్రీతో పాటు ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాల‌లో కూడా ఈ విష‌యం చ‌ర్చనీయాంశంగా మారింది. ఆగ‌స్ట్ లో వ‌రుణ్‌, లావ‌ణ్య పెళ్లి ఉంటుంద‌ని కొద్ది రోజులుగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే అది అవాస్త‌మ‌ని తెలుస్తుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం  నవంబర్ నెలలో పెళ్లి జరుగుతుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.  ఎంగేజ్‌మెంట్ రోజే ఆ ముహూర్తం ఫిక్స్  చేసినట్టు టాక్.

ఇక  వీళ్ల పెళ్లి హైదరాబాద్‌ , ఇండియాలో కాకుండా ఫారిన్‌లో జరిపేందుకు మెగా ఫ్యామిలీ ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్టు తెలుస్తుంది. వీరి ప్రేమకు పునాది పడిన ఇటలీ అయితే బెస్ట్ అని వారు ఫిక్స్ కావ‌డంతో   వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి మ్యారేజ్‌ ప్లేస్ ఇటలీ అని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి ఇట‌లీకి వెళ్లి అక్క‌డ ఏర్పాట్ల‌ని ప‌రిశీలించి వ‌చ్చార‌ట‌. అక్క‌డే పెళ్లికి సంబంధించిన షాపింగ్ కూడా చేసిన‌ట్టు స‌మాచారం. ఇక వీరి పెళ్లికి కేవ‌లం మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ కూడా హాజ‌రు కానుంద‌ని స‌మాచారం.

శ్రీను వైట్ల తెర‌కెక్కించిన  మిస్టర్ లో వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి తొలిసారి జంటగా నటించ‌గా, ఆ మూవీ  చిత్రీకరణలో వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అనంత‌రం ‘అంతరిక్షం’లో మరోసారి జంటగా నటించ‌గా, ఆ స్నేహం ప్రేమ‌గా కూడా మారింది కొన్నేళ్లుగా వీరి ప్రేమ‌కి సంబంధించి అనేక ప్ర‌చారాలు జ‌రుగుతుండ‌గా, దానిపై స్పందించేందుకు వారు ఏ మాత్రం ఇష్ట‌ప‌డలేదు. సైలెంట్‌గా నిశ్చితార్థం జ‌రుపుకొని అంద‌రికి షాక్ ఇచ్చారు. ఇక  ప్రస్తుతం వరుణ్ తేజ్ చేస్తున్న సినిమాలలకు వస్తే… ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాంఢీవదారి అర్జున అనే చిత్రం చేశారు. ఆగస్టు 25న ఆ విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక  లావణ్యా త్రిపాఠి రెండు మూడు సినిమాలు చేస్తుండ‌గా, మ‌రి కొన్ని చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...