Home Film News Roja: సీనియ‌ర్ న‌టి రోజాకి తీవ్ర అస్వ‌స్థ‌త‌.. హుటాహుటిన ఆసుప‌త్రికి త‌రలింపు..!
Film News

Roja: సీనియ‌ర్ న‌టి రోజాకి తీవ్ర అస్వ‌స్థ‌త‌.. హుటాహుటిన ఆసుప‌త్రికి త‌రలింపు..!

Roja: టాలీవుడ్ సినిమా ఇండ‌స్ట్రీలో ఒక‌ప్పుడు త‌న న‌ట‌న‌తో ఎంతో మంది ప్రేక్ష‌కుల అభిమానం చూర‌గొన్నారు రోజా. అచ్చమైన తెలుగు అమ్మాయిగా ఆమె విభిన్నమైన తరహా పాత్రలు పోషించి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించారు. సినిమాల‌కి బ్రేక్ ఇచ్చిన త‌ర్వాత రోజా ప‌లు షోల‌కి జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించింది. జ‌బ‌ర్ధ‌స్త్‌లో నాగ‌బాబుతో క‌లిసి చాలా ఏళ్ల పాటు జ‌డ్జిగా ఉంది. షోలో ఆమె చేసిన సంద‌డి మాములుగా ఉండేది కాదు. అయితే మంత్రిగా ప‌దవీ బాధ్య‌త‌లు అందుకున్న త‌ర్వాత సినిమా ఇండ‌స్ట్రీకి పూర్తిగా దూర‌మైంది రోజా. అయితే అప్పుడప్పుడు ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌లో డ్యాన్స్ లు చేస్తూ సంద‌డి చేస్తుంటుంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను వెంట‌నే ఆస్పత్రికి తరలించారు. రోజా కొద్ది రోజులుగా కాలునొప్పి, వాపుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె చికిత్స కోసం చెన్నైలోని థౌజండ్‌ లైట్స్‌లో ఉన్న అపోలో ఆస్పత్రిలో చేరినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. శుక్రవారం రాత్రి చెన్నైలోని తన ఇంట్లో కుటుంబసభ్యులతో క‌లిసి స‌ర‌దాగా గ‌డిపిన రోజాకి ఒక్కసారిగా కాలివాపు, నొప్పి రావడంతో అర్ధరాత్రి కుటుంబసభ్యులు హుటాహుటిన‌ అపోలో అస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

అయితే రోజా ఆరోగ్య ప‌రిస్థితి గురించి పెద్ద‌గా ఆందోళ‌న చెంద‌న‌క్క‌ర్లేద‌ని డాక్ట‌ర్స్ అంటున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, వాపు కూడా తగ్గిందని వైద్యులు తెలియ‌జేశారు. త్వరలోనే రోజాను డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.. రోజా అస్వస్థతకు గురైందనేని తెలిసి వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఆందోళ‌న‌కి గుర‌య్యారు. అయితే ఆమె బాగానే ఉంద‌ని డాక్టర్లు ప్రకటించడంతో ఊపిరిపీల్చుకున్నారు. శుక్రవారం అర్థరాత్రి ఆమె అస్వస్థతకు గురి కాగా.. విష‌యం కాస్త ఆలస్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. కాగా, ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీల‌క‌మైన‌ నాయకురాలిగా కొనసాగుతున్న రోజా.. అప్పుడప్పుడు ఆమె ప్రత్యర్థి రాజకీయ నాయకులపై కౌంటర్లు ఇచ్చే విధంగా మాట్లాడుతూ హాట్ టాపిక్‌గా నిలుస్తుంటారు.

Related Articles

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...

బాలయ్య లైఫ్ లోనే మర్చిపోలేని పీడ కల .. ఎన్ని సంవత్సరాలు మ‌రీన‌ మాయని గాయం ఇదే..!

టాలీవుడ్‌లోనే నంద‌మూరీ బాలకృష్ణకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో...

25 లక్షల కోసం ఆ ‘పొలిటీషియన్’తో అంటూ అనుచిత వ్యాఖ్యలు.. “పోరంబోకు వెధవ”.. కోపంతో రెచ్చిపోయిన త్రిష!

ఈ రీసెంట్ టైమ్స్ లో చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్లపై చీప్ కామెంట్స్ వల్గర్ గా...

చివరికి నాగచైతన్య పరిస్థితి ఏంటి ఇలా తయారయ్యింది… సమంత చెప్పినట్లే అయిందిగా..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఎలాంటి ప్రత్యేకత ఉందో అందరికీ తెలిసిందే..నట సామ్రాట్...