Home Film News Allu Arjun: వరుణ్, లావణ్యల పెళ్లి గురించి మా నాన్న ఆ నాడే చెప్పార‌న్న అల్లు అర్జున్
Film News

Allu Arjun: వరుణ్, లావణ్యల పెళ్లి గురించి మా నాన్న ఆ నాడే చెప్పార‌న్న అల్లు అర్జున్

Allu Arjun: కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీలోని కొంద‌రి విడాకుల గురించి జోరుగా వార్త‌లు వ‌చ్చాయి. ఈ స‌మ‌యంలో వ‌రుణ్ తేజ్ త‌న ప్రేయ‌సి లావ‌ణ్య త్రిపాఠితో జూన్ 9న ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకొని షాకిచ్చాడు. కొన్నాళ్లుగా వీరిద్ద‌రి ప్రేమ వ్య‌వ‌హారంపై వార్త‌లు వ‌స్తున్నా కూడా ఖండించారే త‌ప్ప ఎప్పుడు ఒప్పుకోలేదు. మొత్తానికి నిశ్చితార్థం జ‌రుపుకున్న ఈ జంట ఏడాది చివ‌ర్లో పెళ్లి చేసుకోనున్నారు. అట్టహాసంగా జరిగిన నిశ్చితార్థ వేడుక‌లో మెగా, అల్లు ఫ్యామిలీ సభ్యులంతా హాజరై తెగ సందడి చేశారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో వరుణ్, లావణ్యలు ఉంగరాలు మార్చుకోగా, ఈవెంట్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

వ‌రుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం త‌ర్వాత వారిరివురికి సంబంధించి అనేక వీడియోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఐకాన్ స్టార్ బన్నీ ఓ పాత వీడియో షేర్ చేశారు. తన తండ్రి విజనరీ అంటూ క్యాప్షన్ పెట్టి వీడియో షేర్ చేశాడు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఒక సినిమా ప్రమోషన్ లో భాగంగా, అల్లు అరవింద్.. లావణ్య గురించి ఆస‌క్తిక‌ర‌ కామెంట్స్ చేశారు. ఉత్తరాది నుంచి వచ్చిన లావణ్య, తెలుగు చక్కగా నేర్చుకుని మాట్లాడుతుందని, ఇక్కడే ఓ అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకుని సెటిల్ అయితే బాగుంటుందని చెప్పారు. అప్పుడు ఆయన మాటలను అక్షరాలా నిజం చేసి చూపించింది లావణ్య.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అల్లు అర‌వింద్ కుటుంబానికి చెందిన అబ్బాయితోనే మూడు ముళ్లు వేయించుకునేందుకు రెడీ కావడం మరింత ఆసక్తి కలిగిస్తోంది. అల్లు అర్జున్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోకి అల్లు అర్జున్.. మా నాన్నకి ముందు చూపు ఉంది, అందుకే ముందే చెప్పాడు అంటూ నవ్వుతూ కామెంట్స్ చేశాడు. కాగా, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలసి ‘మిస్టర్’ అనే సినిమాలో నటించ‌గా ఆ స‌మ‌యంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య డీప్ ఫ్రెండ్షిప్ ఏర్ప‌డింద‌ట‌.ఈ సినిమా అప్పట్లో డిజాస్టర్ అయిన‌ప్ప‌టికీ వరుణ్, లావణ్యల ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కి మాత్రం చాలా ఉప‌యోగ‌ప‌డింది. మిస్ట‌ర్ సినిమా తర్వాత ‘అంతరిక్షం’ అనే సినిమాలోఈ ఇద్ద‌రు న‌టించ‌గా, ఆ చిత్రం కూడా పెద్ద‌గా విజ‌యం అందుకోలేక‌పోయింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...