Home Film News Prabhas – Chiranjeevi : ప్రభాస్, చిరంజీవి గారి సినిమాలు వేరే లెవల్లో ఉంటాయ్
Film News

Prabhas – Chiranjeevi : ప్రభాస్, చిరంజీవి గారి సినిమాలు వేరే లెవల్లో ఉంటాయ్

Prabhas - Chiranjeevi - Maruthi
Prabhas - Chiranjeevi - Maruthi

Prabhas – Chiranjeevi: మారుతి.. ‘ఈ రోజుల్లో’ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసి.. వరుస విజయాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతి సినిమాలోనూ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మెసేజ్‌ని కూడా తన స్టైల్లో చెప్పి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

గోపిచంద్‌తో చేసిన ‘పక్కా కమర్షియల్’ జూలై 1న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మీడియాకిస్తున్న ఇంటర్వూల్లో ‘పక్కా కమర్షియల్’ తో పాటు తన తర్వాతి సినిమాల గురించి కూడా చెప్పుకొచ్చారు మారుతి. రెబల్ స్టార్ ప్రభాస్‌తో సినిమా చెయ్యబోతున్నారని, లేదు.. ఆ సినిమా ఆగిపోయిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభాస్‌తో మూవీ కచ్చితంగా ఉంటుందని చెప్పారు.

‘పక్కా కమర్షియల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మారుతితో తనకున్న పరిచయం గురించి చెప్తూ.. పూర్తి కథ రెడీ చేసుకో సినిమా చేద్దామని చెప్పారు. స్వయంగా చిరు వేదిక మీద ఆ మాట అనేసరికి మారుతి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. చిరు, ప్రభాస్ ఇద్దరితో చెయ్యబోయే సినిమాలు ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌ని మెప్పించేలా సరికొత్తగా తెరకెక్కిస్తానని చెప్పుకొచ్చారు మారుతి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...