Home Film News Anasuya: విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడి మూవీపై అన‌సూయ ట్వీట్…షాక్‌లో రౌడీ బాయ్ ఫ్యాన్స్
Film News

Anasuya: విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడి మూవీపై అన‌సూయ ట్వీట్…షాక్‌లో రౌడీ బాయ్ ఫ్యాన్స్

Anasuya: ఇటీవ‌ల అందాల ముద్దుగుమ్మఅన‌సూయ ఎక్కువ‌గా వివాదాల‌తోనే వార్త‌ల‌లో నిలుస్తుంది. కొన్నాళ్లుగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని టార్గెట్ చేస్తూ అన‌సూయ చేసే ట్వీట్స్ టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. విజ‌య్  దేవ‌ర‌కొండ హీరోగా రూపొందిన‌  ఖుషి సినిమా పోస్టర్‌లో హీరో పేరు ముందు ది అని పెట్టుకోవడాన్ని అన‌సూయ త‌ప్పు ప‌డుతూ పైత్యం ఎక్కువైంది అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌తో రౌడీ బాయ్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. వారికి అన‌సూయ కూడా ధీటుగా బ‌దులిచ్చింది. కొద్ది రోజుల పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్‌కి, అన‌సూయ‌కి మ‌ధ్య ట్విట్ట‌ర్ యుద్ధం జ‌రిగింది.

అయితే విమానం మూవీ ప్ర‌మోష‌న్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో వివాదం గురించి నోరు విప్పిన అన‌సూయ‌.. ఈ వివాదం ఇక్కడితో   ఆపేయాలనుకుంటున్నాను. అందుకు కార‌ణం నాకు మానసిక ప్రశాంతత కావాలి అని అన‌సూయ పేర్కొంది. ఇక అప్ప‌టి నుండి అన‌సూయ.. విజ‌య్ దేవ‌ర‌కొండకి వ్య‌తిరేఖంగా ఎలాంటి ట్వీట్ చేయ‌లేదు. అయితే తాజాగా విజ‌య్ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ మూవీపై అన‌సూయ స్పందించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆనంద్ దేవ‌ర‌కొండ తాజాగా బేబి అనే చిత్రం చేయ‌గా,ఇటీవ‌ల మూవీ ట్రైల‌ర్ విడుద‌లైంది. దీనిపై అన‌సూయ ట్వీట్ వేసింది.

నేను కొంచెం లేటుగా స్పందించాను అనుకుంటా , అయిన‌పర్లేదు. ట్రైలర్ మాత్రం మనసుకు హత్తుకుంది. డైలాగ్స్, ఒరిజినాలిటీ అన్నీ కూడ న‌న్ను కదిలించాయి. టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియ‌జేస్తున్నాను.. ఇది నాకు తెలిసిన వాళ్ళ కథలానే ఉంది’, అంటూ అన‌సూయ ట్వీట్ చేసింది. విజయ్ దేవరకొండతో వివాదం తర్వాత తమ్ముడు సినిమాపై అనసూయ  ఇలా  పాజిటివ్ ట్వీట్ చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది అని చెప్పాలి . కాగా, అన‌సూయ ఆ మ‌ధ్య‌.. విజయ్ దేవరకొండ వద్ద పని చేసే ఓ వ్యక్తి డబ్బులిచ్చి తనపై దుష్ప్రచారం చేయించాడని  కొన్ని ఆరోపణలు చేశారు. ఈ విష‌యం విజయ్ కి తెలియకుండా ఆ వ్యక్తి నన్ను టార్గెట్ చేస్తాడని నేను అనుకోను. ఆ విషయం తెలిశాక నేను చాలా బాధపడ్డానని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.

Related Articles

1000 కోట్లు ఇచ్చినా సరే అలా చేయను అంటూ తెగేసి చెప్పేస్తున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..!?

ప్రస్తుతం ఇండియన్ సినిమా చిత్ర పరిశ్రమలో భారీ స్టార్‌డంతో దూసుకుపోతున్న ప్రభాస్ పెళ్లి వయసు దాటుతున్న...

మహేష్ కోసం అవతార్ డైరెక్టర్ ను తీసుకొస్తున్న రాజమౌళి.. జక్కన్న స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే అధికార...

రామ్ చరణ్ ఫోన్ లో ఎన్టీఆర్ నెంబర్ ఏమని ఉంటుందో తెలుసా.. భ‌లే సిల్లిగా లేదు..!

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ టాలీవుడ్ లో అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా...

చిరు విశ్వంభ‌ర‌లో మెగా అభిమానులను ఎగ్జైట్ చేస్తున్న క్రేజీ న్యూస్..!

పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో హిట్, ప్లాఫ్ లతో సంబంధం...