Home Film News Samantha: ప‌బ్‌లో రెచ్చిపోయి డ్యాన్స్‌లు చేసిన స‌మంత‌.. ఇలా త‌యారైందేంట‌ని ఫ్యాన్స్ ఆగ్ర‌హం
Film News

Samantha: ప‌బ్‌లో రెచ్చిపోయి డ్యాన్స్‌లు చేసిన స‌మంత‌.. ఇలా త‌యారైందేంట‌ని ఫ్యాన్స్ ఆగ్ర‌హం

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా అతి త‌క్కు కాలంలోనే మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకుంది స‌మంత‌. అనారోగ్యం వ‌ల‌న కొన్నాళ్లు సినిమాల‌కి దూరంగా ఉన్న స‌మంత ఇప్పుడు త‌న జోరు పెంచింది. సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో నానా సంద‌డి చేస్తుంది . ప్రస్తుతం రాజ్, డీకే దర్శకత్వంలో సిటాడెల్  అనే సిరీస్ చేస్తుండ‌గా, ఇందులో  వరుణ్ ధావన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది స‌మంత. ఈ సిరీస్  షూటింగ్ కోసం గ‌త కొద్ది రోజులుగా విదేశాల‌లోనే ఉంటుంది ఈ అందాల ముద్దుగుమ్మ‌.మొన్నటికి మొన్న సెర్బియాలో రాష్ట్రపతిని కలిసింది సిటాడెల్ టీం. సెర్బియా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా  సమంత తో పాటు, సిటాడెల్ టీం  క‌ల‌వ‌గా వాటికి సంబంధించిన పిక్స్ నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేశాయి.

సిటాడెల్ కోసం సెర్బియా వెళ్లిన స‌మంత అక్క‌డ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది. షూటింగ్ అయిపోయిన తర్వాత  ఈ భామ‌ సిటాడెల్ యూనిట్ తో కలిసి అక్కడ సెర్బియాలోని ఓ పబ్ కి వెళ్ళింది. అక్కడ సమంత న‌టించి పుష్ప సినిమాలోని ఊ అంటావా ఊ ఊ అంటావా అనే  సాంగ్ ప్లే చేశారు. దీంతో స‌మంత చేతిలో బాటిల్ ప‌ట్టుకొని డ్యాన్సులు వేస్తూ రెచ్చిపోయింది. మ‌రోవైపు అక్కడ పబ్ కి వచ్చిన వాళ్లంతా కూడా ఆ పాటలకు ఫుల్ గా డ్యాన్స్ వేస్తూ మైకంలో మునిగి తేలారు. సమంత బ్లాక్ డ్రెస్ లో మాస్ సాంగ్‌కి ఫుల్ జోష్ తో డ్యాన్స్ చేయ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

కొంద‌రు స‌మంత డ్యాన్స్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తుండ‌గా, మ‌రి కొంద‌రు మాత్రం ఆ ప‌బ్‌ల‌లో ఆ డ్యాన్స్‌లు, ఆ ర‌చ్చ ఏందని తిట్టిపోస్తున్నారు. అక్కినేని కోడ‌లిగా ప్ర‌మోష‌న్ అందుకున్న స‌మంత ఎప్పుడైతే నాగ చైత‌న్య నుండి విడాకులు తీసుకుందో ఇక అప్ప‌టినుండి పూర్తిగా మారింది. త‌న‌కు న‌చ్చిన‌ట్టు జీవిస్తుంది. ఐటెం సాంగ్‌కి ఓకే చెప్ప‌డం, డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకొని అభిమానుల‌ని అల‌రింప‌జేయ‌డం వంటివి చేస్తూ ఎప్పుడు హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. చివ‌రిగా తెలుగులో శాకుంత‌లం చిత్రంతో ప‌ల‌క‌రించింది. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి ఖుషీ అనే సినిమా చేస్తుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...