Home Film News Nagababu: అప్పుడు ప‌వ‌న్‌కి మార్గ‌నిర్ధేశం చేసాను.. ఇప్పుడు ఆయ‌న అడుగుజాడ‌ల్లో న‌డుస్తున్నాన‌న్న నాగ‌బాబు
Film News

Nagababu: అప్పుడు ప‌వ‌న్‌కి మార్గ‌నిర్ధేశం చేసాను.. ఇప్పుడు ఆయ‌న అడుగుజాడ‌ల్లో న‌డుస్తున్నాన‌న్న నాగ‌బాబు

Nagababu: చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ మెగా ఫ్యామిలీలో ఓ వేడుక జ‌రిగింది. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ త‌ను ప్రేమించిన లావ‌ణ్య త్రిపాఠితో నిశ్చితార్థం జ‌రుపుకున్నాడు. కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో వ‌రుణ్‌- లావ‌ణ్య ఈవెంట్ అట్ట‌హాసంగా ముగిసింది.అయితే ఈ వేడుక‌కి  ప‌వ‌న్ క‌ళ్యాణ్ రావ‌డం ప్ర‌త్యేక ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. సాధార‌ణంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సొంత వాళ్ల వేడుక‌లకి డుమ్మాలు కొట్టిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయి. ఈ వేడుక‌కి కూడా వ‌స్తాడా రాడా అని అంద‌రు అనుకుంటున్న స‌మ‌యంలో స‌ర్‌ప్రైజింగ్ లుక్‌తో షాకింగ్ ఎంట్రీ ఇచ్చాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి సంబంధించిన పిక్స్ ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

అయితే ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఎక్కువ గ‌డుపుతున్నాడు నాగ‌బాబు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థాపించిన జ‌న‌సేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాజకీయ వ్యవహారాల్లో చురుగ్గా ఉంటూ త‌మ్ముడికి ప్రోత్సాహం అందిస్తున్నారు నాగ‌బాబు.ఆరెంజ్‌ సినిమా తర్వాత నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయిన నాగ‌బాబుకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాఆలా స‌పోర్ట్‌గా ఉన్నాడు. ఈక్రమంలో పవన్‌తో పాటు అతను స్థాపించిన జనసేన పార్టీకి కూడా  మెగా బ్రదర్ త‌న స‌పోర్ట్ అందిస్తూ వ‌స్తున్నారు. అయితే వ‌రుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత  పవన్‌ను ఉద్దేశిస్తూ నాగబాబు చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి ఎంగెజ్‌మెంట్‌ వేడుకకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌రు కాగా, ఆయ‌న‌ని సాదరంగా ఆహ్వానించారు నాగబాబు. అతని వెనకాలే నడుచుకుంటూ ఎంగేజ్‌మెంట్ వేదిక దగ్గరకు తీసుకొచ్చారు మెగా బ్ర‌దర్.  దీనికి సంబంధించిన ఫొటోను త‌న సోష‌ల్ మీడియాలో  షేర్‌ చేసిన నాగబాబు ‘ అతను చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు, సరైన మార్గంలో ఎలా నడవాలి? ఎలా ఉండాల‌ని మార్గనిర్దేశం చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడుఇద్ద‌రం కూడా పెద్దవాళ్లమయ్యాం. పవన్ కళ్యాణ్ ఉన్నత స్థానంలో ఉన్నాడు. సరైన మార్గంలో నడిచే అవగాహన కూడా సంపాదించాడు. అందుకే, ఇప్పుడు నేను అతని అడుగుజాడల్లో నడుస్తున్నాను అంటూ నాగ‌బాబు చాలా ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...