Home Film News Bigg Boss 7: ఈ సారి బిగ్ బాస్‌లో ఇన్ని మార్పులా.. వీకెంట్ ఎలిమినేష‌న్ కాకుండా..!
Film News

Bigg Boss 7: ఈ సారి బిగ్ బాస్‌లో ఇన్ని మార్పులా.. వీకెంట్ ఎలిమినేష‌న్ కాకుండా..!

Bigg Boss 7: బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ఓ మూడు నెల‌ల పాటు మంచి వినోదం పంచుతున్న షో బిగ్ బాస్.  తెలుగులో ఇప్ప‌టికే ఆరు సీజ‌న్స్ పూర్తి చేసుకున్న షో సీజ‌న్ 7 జ‌రుపుకునేందుకు సిద్ధ‌మైంది. ఈ సీజ‌న్ మాత్రం గ‌త సీజ‌న్స్ మించి ఉంటుంది. స‌రికొత్త రూల్స్, పాపుల‌ర్ కంటెస్టెంట్స్, స‌డెన్ ఎలిమినేషన్స్ .. ఇలా మొత్తం కూడా భిన్నంగా ఉంటుంద‌ట‌. ఇటీవల బిగ్ బాస్ సీజ‌న్ 7కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, ఇందులో   హోస్ట్ నాగార్జున. ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు సీజన్లు చూసేశాం.. అంతా మాకు తెలుసనుకుంటున్నారు కంటెస్టెంట్లు.. పాపం పసివాళ్లు.. మా ప్లాన్స్‌ వాళ్లకు తెలియవు కదా.. న్యూ రూల్స్‌, న్యూ ఛాలెంజెస్‌, న్యూ బిగ్‌బాస్‌, ఈసారి బిగ్‌బాస్‌ 7.. ఉల్టా పల్టా’ అని రీసెంట్‌గా విడుద‌లైన ప్రోమోలో తెలియ‌జేశారు.

నాగార్జున చెప్పిన మాట‌ల‌ని బ‌ట్టి చూస్తుంటే ఈ సీజన్‌లో భారీ మార్పులే ఉండ‌బోతున్నాయ‌ని తెలుస్తుంది. ఓటింగ్ విష‌యంలో కంటెస్టెంట్స్ పీఆర్ఓల‌ని పెట్టుకొని పక్కా ప్లానింగ్‌తో హౌజ్‌లోకి వ‌స్తున్నార‌ని భావించిన నిర్వాహ‌కులు ఈ సారి ఈ ఓటింగ్ విష‌యంలో పెద్ద మార్పులే చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. గ‌త సీజ‌న్స్ లో నామినేషన్స్‌లో ఉన్న వారికి మద్దతుగా ఓట్లు వేయడానికి సోమవారం నుంచి శుక్రవారం వరకు సమయం ఇచ్చేవారు. కాని ఈ సీజ‌న్‌లో మాత్రం  3 రోజులకే పరిమితం చేశారని తెలుస్తోంది. ఇక    వారం మధ్యలో గేమ్స్‌, శని వారం నాగార్జున హోస్టింగ్‌, ఆదివారం ఎలిమినేషన్ ఇలా ఒక ప‌ద్ద‌తిలో ఆరు సీజ‌న్స్ న‌డిచాయి. కాని ఇప్పుడు అవ‌న్నీ మార‌నున్నట్టు తెలుస్తుంది.

ఇక బిగ్ బాస్ సీజ‌న్ 7లో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి. సినిమా, టీవీ, యూట్యూబ్‌ల కి సంబంధించిన ప్ర‌ముఖుల‌ని ఈ సీజ‌న్‌కి తీసుకోబోతున్నార‌ని తెలుస్తుంది. ఇక గ‌తంలో చూస్తే  బిగ్‌బాస్  షో సెప్టెంబర్‌ 3,4,5 తేదీల్లోనే ప్రారంభం కాగా, ఈసీజన్‌ కూడా ఇదే తారీఖుల్లోనే  మొద‌లు కానున్నట్లు సమాచారం. ఒకవేళ ఏదైన స‌ర్‌ప్రైజ్ ఇవ్వాల‌నుకుంటే ముందైన ప్రారంభించొచ్చు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...