Home Film News Priyamani: న‌న్ను వారు దార‌ణంగా తిట్టిపోసారు.. ఓపెన్ అయిన ప్రియ‌మ‌ణి
Film News

Priyamani: న‌న్ను వారు దార‌ణంగా తిట్టిపోసారు.. ఓపెన్ అయిన ప్రియ‌మ‌ణి

Priyamani: సోష‌ల్ మీడియా ప్రాముఖ్య‌త పెరిగాక సెల‌బ్రిటీలపై విప‌రీత‌మైన ట్రోలింగ్ న‌డుస్తుంది. ప్ర‌తి చిన్న విష‌యానికి కూడా ట్రోల్ చేస్తూ వారిని ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా న‌టి ప్రియ‌మణి తాను ఎదుర్కొన్న ప‌రిస్థితుల గురించి తాజాగా చెప్పుకొచ్చి  ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. క‌న్న‌డ అమ్మాయి అయిన ప్రియ‌మ‌ణి ఎక్కువ‌గా తెలుగు సినిమాలు చేసి తెలుగువారికి బాగా ద‌గ్గ‌రైంది.  ఒక్క తెలుగులోనే కాకుండా త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల‌లో ప‌లువురు స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టించింది. హీరోయిన్‌గా ఓ ఊపు ఊపిన ప్రియ‌మ‌ణి ఇప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా త‌న స్తా చాటుతుంది. ఇటీవ‌ల నాగ చైత‌న్య క‌స్ట‌డీ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించిన ఈ ముద్దుగుమ్మ ప్ర‌స్తుతం ప‌లు సినిమాలు వెబ్ సిరీస్‌ల‌తో బిజీగా ఉంది.

తాజాగా ప్రియ‌మ‌ణి సోష‌ల్ మీడియాలో  ఎదుర్కొన్న ట్రోలింగ్ గురించి  ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ముఖ్యంగా పెళ్లి స‌మ‌యంలో త‌న‌ని దారుణంగా ట్రోల్ చేశార‌ని ప్రియ‌మ‌ణి పేర్కొంది. అయితే  తాను ఆన్‌లైన్‌లో ట్రోలింగ్‌ని అంత‌గా  పట్టించుకోనని చెప్పుకొచ్చింది. బాడీ షేమింగ్‌, శరీర రంగు విషయంలోనన్ను ఇప్ప‌టికీ విమ‌ర్శిస్తూనే ఉంటారు.  ముస్తఫాతో  నా ఎంగేజ్‌మెంట్ జ‌రిగిన‌ప్పుడు ఆ ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నప్పుడు `నువ్వు ఎందుకు ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నావని  చాలా దారుణమైన ప‌ద‌జాలంతో న‌న్ను దూషించారు.

న‌న్ను ట్రోల్స్ చేసే వారంద‌రికి నేను చెప్పేది ఒక్క‌టే. ఇది నేను ఎంచుకున్న‌ జీవితం. ఎవ‌రితో జీవితాన్ని పంచుకోవాల‌న్న‌ది  అనేది పూర్తిగా నా ఇష్టం. అన‌వ‌స‌రమైన ట్రోల్స్‌కి  అటెన్ష‌న్ ఇచ్చి వాటి వ‌ల్ల బాధ ప‌డ‌టం నాకిష్టం ఉండ‌దు. అందుకే నేను ఇలాంటివి పెద్ద‌గా ప‌ట్టించుకోను అని ప్రియ‌మ‌ణి చెప్పుకొచ్చింది. ప్రియ‌మ‌ణి వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి.  ఈ అమ్మ‌డు ఇప్పుడు తమిళంలో ఓ సినిమా, కన్నడలో ఓ చిత్రం హిందీలో `మైదాన్‌`, `జవాన్‌` చిత్రాల్లో నటిస్తూ బిజీగా బిజీగా ఉంది. అలానే షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రం కూడా చేస్తుంది. మరోవైపు ఓటీటీలోనూ త‌న హ‌వా చూపిస్తుంది ప్రియమణి.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...