Home Film News Balayya-Uday Kiran: బాల‌కృష్ణ‌తో క‌లిసి ఉద‌య్ కిర‌ణ్ ఓ సినిమా చేశాడ‌ని తెలుసా.. ఆ సినిమా ఏంటంటే..!
Film News

Balayya-Uday Kiran: బాల‌కృష్ణ‌తో క‌లిసి ఉద‌య్ కిర‌ణ్ ఓ సినిమా చేశాడ‌ని తెలుసా.. ఆ సినిమా ఏంటంటే..!

Balayya-Uday Kiran: చిత్రం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన హీరో ఉద‌య్ కిర‌ణ్‌. కెరీర్‌లో మంచి సినిమాలు చేసి స్టార్ హీరోగా పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించిన ఉద‌య్ కిర‌ణ్ ఊహించ‌ని విధంగా కన్నుమూసారు. ల‌వ‌ర్ బోయ్‌గా పేరు తెచ్చుకున్న ఉద‌య్ కిర‌ణ్‌..  ప్రేమకథా చిత్రాలతో యూత్‌లో మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు.  అప్పట్లో ఉద‌య్ కిర‌ణ్ పెద్ద పెద్ద హీరోల‌కి సైతం పోటీ ఇచ్చేవాడు. మంచి భ‌విష్య‌త్ ఉన్న ఉద‌య్ కిర‌ణ్‌ని  విధి చిన్న చూపు చూసింది. కెరీర్‌తో పాటు, వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు ఒకేసారి చుట్టుముట్ట‌డంతో  ఆత్మహత్య చేసుకుని మ‌న అందరినీ తీవ్ర విషాదంలో ముంచాడు. జూన్ 26న ఉద‌య్ కిర‌ణ్ జ‌యంతి కాగా, ఆయ‌న‌కు సంబంధించిన విష‌యాలు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

2000 సంవ‌త్స‌ర‌లో చిత్రం సినిమాతోఆరంగేట్రం చేసిన ఉద‌య్ కిర‌ణ్  నువ్వు నేను సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. అనంత‌రం  మనసంతా నువ్వే సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. హ్యాట్రిక్ విజ‌యాలు ఉద‌య్ కిర‌ణ్‌కి ద‌క్క‌డంతో ఆయ‌న‌కు ఒకేసారి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. కాని రాను రాను ఏర్ప‌డ్డ విచిత్ర ప‌రిస్థితుల వ‌ల‌న ఉద‌య్ కిర‌ణ్ తీవ్ర మానసిక సంఘర్షణకు గురయ్యారు.  2014 జనవరి 6న తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకొని అంద‌రికి షాక్ ఇచ్చారు ఉద‌య్ కిర‌ణ్‌. ఆయ‌న మృతిని ఇప్ప‌టికీ ఎవ‌రు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

ఉద‌య్ కిర‌ణ్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న  నందమూరి నటసింహం బాలకృష్ణతో ఉదయ్ కలిసి దిగిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇందులో  బాల‌కృష్ణ‌తో క‌లిసి ఉద‌య్ కిర‌ణ్  ఫొటోల‌కి పోజులు ఇచ్చాడు. ఇది న‌ర్త‌న‌శాల మూవీ షూటింగ్ సంద‌ర్భంలోనింది.  2004 మార్చి 1న రామోజీ ఫిలిం సిటీలో వేసిన పర్ణశాల సెట్ లో చిత్ర షూటింగ్ మొద‌లు కాగా, ఈ చిత్రంలో సౌంద‌ర్య ముఖ్య పాత్ర పోషించింది. ఆమె  అకాల మరణంతో ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. అయితే ఇందులో  అభిమాన్యుడి పాత్ర కోసం ఉద‌య్ కిర‌ణ్‌ని తీసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ ఓపెనింగ్ సంద‌ర్భంగా ఉదయ్ కిరణ్ బాలకృష్ణతో తీసుకున్న ఫోటో ఇది.ఇందులో చిరున‌వ్వులు చిందిస్తూ క‌నిపిస్తున్నాయి. అయితే అంతా బాగుండి ఉంటే ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి అలరించి ఉండేది.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...