Home Film News Romantic Beauty: రొమాంటిక్ బ్యూటీకి అవ‌కాశాలు ఎందుకు రావ‌డం లేదు.. కెరీర్ ముగిసిన‌ట్టేనా..!
Film News

Romantic Beauty: రొమాంటిక్ బ్యూటీకి అవ‌కాశాలు ఎందుకు రావ‌డం లేదు.. కెరీర్ ముగిసిన‌ట్టేనా..!

Romantic Beauty: కొంద‌రు న‌టీమ‌ణులు ఒక్క సినిమాతో లైమ్ లైట్‌లోకి వ‌చ్చి ఆ త‌ర్వాత అవ‌కాశాలు లేక ఇబ్బందులు ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మకు ప్ర‌స్తుతం టాలీవుడ్ లో అవ‌కాశాలు కరువయ్యాయి. పూరీ తనయుడు ఆకాష్ పూరీతో రొమాంటిక్ అనే సినిమా చేసిన ఈ ముద్దుగుమ్మ ఇందులో త‌న న‌ట‌న‌తో పాటు గ్లామ‌ర్ తో ఆడియ‌న్స మ‌న‌సులు గెలుచుకుంది. మొదటి సినిమాలోనే వావ్ అనిపించ‌నుకున్న‌ కెతిక ఆ తర్వాత ఛాన్స్ లు అందుకోవడంలో వెనకబడింది. నాగ శౌర్యతో లక్ష్య, వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా సినిమా చేసినా కూడా ఈ రెండు చిత్రాలు బెడిసికొట్టాయి. దీంతో అమ్మడికి అవ‌కాశాలు అంత‌గా రావ‌డం లేదు.

అయితే ప‌వ‌న్ – సాయి ధ‌ర‌మ్ తేజ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న బ్రో అనే సినిమాలో ల‌క్కీ ఛాన్స్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ‌. కెరీర్ మొదట్లో ఈ అమ్మడు కథల ఎంపిక విషయంలో కాస్త‌ తెలివి ప్రదర్శించాల్సి ఉంటుంది. కాని కెతిక చిన్న చిన్న‌ పొరపాట్లు చేస్తుందని తెలుస్తుంది. కొన్నిసార్లు కొన్ని కాంబినేషన్ సినిమాల్లో పాత్ర అంత గొప్పగా లేకపోయిన‌ప్ప‌టికీ హీరోయిన్స్ మైలేజ్ పెంచేందుకు సహకరిస్తుంది. అలాంటి ఛాన్స్ లు వచ్చినప్పుడు అవ‌కాశాన్ని ఏ మాత్రం మిస్ చేసుకోవ‌ద్దు. అయితే కొంద‌రు మాత్రం తమ పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటేనే సినిమాలు ఓకే చేస్తాం లేదంటే ఖాళీగా ఉంటామ‌నే ధోర‌ణిలో ముందుకు సాగుతుంటారు. కేతిక అలాంటి ప‌నులు చేయ‌కుండా ఉండ‌డం ఉత్త‌మం.

యువ హీరోలకు బెస్ట్ ఆప్షన్ అయిన కేతిక శర్మ అందరు హీరోలతో ఒక రౌండ్ చుట్టే అవ‌కాశం లేక‌పోలేదు. కెరీర్ లో ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అనేది స‌ర్వ‌సాధార‌ణం. అయితే దానికి నిరుత్సాహ‌ప‌డ‌డం, వెనక్కి తగ్గాల్సిన ప‌ని ఏ మాత్రం లేదు. ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ కటౌట్ ఉన్న కెతిక బ్రో సినిమాతో మ‌ళ్లీ ఫామ్ లోకి రావాల‌ని అమ్మ‌డి అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమాతో అమ్మడి ఫేట్ మారుతుందని చెప్పొచ్చు. బ్రో సినిమా ఎలాగైనా హిట్ అవ్వడం పక్కా అని అంద‌రు భావిస్తున్న క్ర‌మంలో, ఈ చిత్రం కెతిక మొదటి హిట్ సినిమా అదే అవుతుంది. ఇక ఈ సినిమా తర్వాత అయినా అమ్మడు సినిమాల విషయంలో దూకుడు చూపిస్తుందా లేదా అనేది చూడాలి.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...