Home Film News Sharwanand Reception: సినీ ప్ర‌ముఖుల మ‌ధ్య భారీ ఎత్తున శ‌ర్వానంద్ రిసెప్ష‌న్.. వేడుక ఎప్పుడంటే..!
Film News

Sharwanand Reception: సినీ ప్ర‌ముఖుల మ‌ధ్య భారీ ఎత్తున శ‌ర్వానంద్ రిసెప్ష‌న్.. వేడుక ఎప్పుడంటే..!

Sharwanand Reception: టాలీవుడ్ స్టైలిష్ హీరో శ‌ర్వానంద్ ఎట్ట‌కేల‌కి ఓ ఇంటివాడయ్యాడు. ఎప్ప‌టి నుండో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌గా ఉన్న శ‌ర్వానంద్ ఈ ఏడాది జనవరి 26న ఎటువంటి ప్రకటన లేకుండా సైలెంట్‌ఘా నిశ్చితార్ధం చేసుకున్నారు. తాజాగా రాజ‌స్థాన్‌లో అట్టహాసంగా పెళ్లి కూడా చేసుకున్నారు. శ‌ర్వానంద్ వివాహం చేసుకున్న యువ‌తి పేరు ర‌క్షిత రెడ్డి కాగా, ఆమె.. మాజీ మంత్రి అయిన టీడీపీ నేత స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మనవరాలు, హైకోర్టు లాయర్ మధుసూధనా రెడ్డి కూతురు . జూన్ 2న ఉదయం వీరిహల్దీ ఫంక్షన్ జరగగా, అదే రోజు రాత్రి సంగీత్ వేడుక నిర్వ‌హించారు. ఇక జూన్ 3 రాత్రి 11 గంటలకు శ‌ర్వానంద్-ర‌క్షిత‌ల పెళ్లి జరిగింది.ఈ నూత‌న దంపతుల‌ని పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆశీర్వ‌దించారు.

రాజస్థాన్లోని జైపూర్ లీలా ప్యాలెస్ లో రాజుల వివాహాన్ని తలదన్నేరీతిలో శ‌ర్వానంద్- ర‌క్షిత‌ల వివాహం జ‌ర‌గ‌గా, ఈ వేడుక‌కి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సైతం హాజ‌ర‌య్యారు. ఇండ‌స్ట్రీ నుండి పెద్ద‌గా ఎవరు హాజ‌రు కాలేద‌ని టాక్. అయితే సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో జూన్ 9వ తేదీన శర్వానంద్ ఒక రిసెప్షన్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే వేదిక ఎక్క‌డ‌నే దానిపై పూర్తి క్లారిటీ లేదు. అయితే రీసెంట్‌గా జ‌రిగిన శ‌ర్వానంద్ – ర‌క్షిత‌ల పెళ్లి వేడుక‌కి సంబంధించిన ఫొటోలు మాత్రం సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

 

ఇక శర్వానంద్ సినిమాల విషయానికొస్తే ఒకే ఒక జీవితం ద్వారా హిట్ అందుకున్న శ‌ర్వా గ‌త కొన్నాళ్లుగా వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అయ్యాడు. ఇప్పుడు ఆయన తిరిగి ఫామ్ లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే కొన్ని సినిమాలకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది.దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్యతో శ‌ర్వా ఇప్ప‌టికే ఓ క్రేజీ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్ర‌స్తుతానికి ఆయ‌న ఆసక్తికరమైన కథలు మాత్రమే చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు టాక్.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...