Home Film News Adipurush: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా చిన‌జీయ‌ర్ స్వామి.. వేదిక ఎక్క‌డంటే..!
Film News

Adipurush: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా చిన‌జీయ‌ర్ స్వామి.. వేదిక ఎక్క‌డంటే..!

Adipurush: యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, అందాల ముద్దుగుమ్మ కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆదిపురుష్‌. దాదాపు అన్ని  కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 16న గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. ఈ చిత్రం రామాయణం కథ ఆధారంగా రూపొంద‌గా, ఇప్పటికే విడుద‌లైన ట్రైలర్‌ చూసి అభిమానులు ఎంజాయ్ చేశారు. మూవీపై భారీగా అంచనాలు కూడా పెంచుకున్నారు. సినిమా తొలిరోజు బాక్సాఫీస్ వద్ద ఎంత వ‌సూళ్లు రాబ‌డుతుందోన‌ని   అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు.  సినీ  నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు త‌ప్ప‌క వ‌సూలు చేస్తుంద‌ని అంటున్నారు.

ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో  ద్వారా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఫ్యాన్సీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు స‌మాచారం. ఆదిపురుష్ సినిమా కోసం మేక‌ర్స్ సుమారు 550 కోట్ల వరకూ ఖర్చు చేసినట్టు  తెలుస్తుంది. శాటిలైట్, డిజిటల్ రైట్స్ అన్ని భాషలూ కలిపి.. దాదాపు 250 కోట్లకు అమ్మేసినట్టు తెలుస్తుంది. మరోవైపు ఏపీ, తెలంగాణ థియేటరికల్ రైట్స్ 185 కోట్ల వ్యాపారం జరిగిందని అంటున్నారు.  ఓవర్సీస్, హిందీ, ఇతర భాషల్లో లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా నిర్మాతలే విడుదల చేస్తున్న నేప‌థ్యంలో మూవీ హిట్ అయితే మాత్రం  మెుదటి వారంతంలోనే నిర్మాతల డబ్బు వెనక్కు వచ్చేసే అవ‌కాశం ఉంది.

ఇక  ఆదిపురుష్ మూవీ రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ సినిమా ప్రమోషన్  స్పీడ్ పెంచారు. జూన్ 6న తిరుపతిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా  నిర్వహించబోతున్నారని కొద్ది సేపటి క్రితం ప్రకటించారు..  ఇండియన్ సినీ చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తుండ‌గా,  ఇప్పటికే ఆదిపురుష్ మెయిన్ స్టేజ్ పనులకు సంబంధించిన ఫొటోస్,  వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఈ వేడుకకు దాదాపు లక్ష వరకు అభిమానులు రాబోతున్నార‌ని అంటున్నారు. ఇక  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిన జీయర్ స్వామిని ఆహ్వానించిన‌ట్టు  మేక‌ర్స్ అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేశారు. ఇక ఈ ఈవెంట్ లో అజయ్-అతుల్ జై శ్రీరామ్ పాటకు లైవ్ పార్ఫార్మెన్స్ ఇవ్వ‌నున్నార‌ట‌.  అంతేకాకుండా దాదాపు రెండొంద‌ల‌ సింగర్స్, రెండొందల డ్యాన్సర్లు ముంబై నుంచి ప్ర‌త్యేకంగా ఈ ఈవెంట్ కోసం తిరుప‌తి వ‌స్తున్నార‌ని వినికిడి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...