Home Film News NTR: తారక్ బాడీ గురించి మోహం మీదే అలా అనేసిన స్టార్ డైరెక్టర్.. క‌సితో ఏం చేశాడంటే..!
Film News

NTR: తారక్ బాడీ గురించి మోహం మీదే అలా అనేసిన స్టార్ డైరెక్టర్.. క‌సితో ఏం చేశాడంటే..!

NTR: జూనియర్ ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీకి ఎంటర్ అయినప్పటి నుండి ఇప్పటివరకు వరకు నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ తో తన అభిమానులతో పాటు ప్రేక్షకుల్ని కూడా ఎంతో ఎంటర్ టైన్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా వరకు బొద్దుగా ఉండేవారు. మరి ఇప్పుడు పర్ఫెక్ట్ బాడీ షేప్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా నిన్ను చూడాలని, ఆది, రాఖీ మూవీస్ లో చాలా బొద్దుగా ఉన్నారు. హీరో అంటే ఫిజిక్ ను కూడా ట్రైన్ చేస్తూ ఉంటారు చాలామంది. కానీ ఎన్టీఆర్ మాత్రం నేను యాక్టింగ్ బాగా చేస్తున్నా.. డాన్స్ కూడా పర్ఫెక్ట్.. ఇక హీరోయిన్స్ తో నాకు ఎలాంటి ఇబ్బంది లేదూ అని ఆన్సర్ ఇచ్చేవారట. అందుకే ఎంతమంది డైరెక్టర్లు నచ్చచెప్పినా ఎన్టీఆర్ వినేవారు కాదట. అలాంటి ఎన్టీఆర్ రాఖీ మూవీ చూసినప్పుడు స్క్రీన్ మీద తనను తాను చూసుకుని ఆ క్యారెక్టర్ కి పూర్తి న్యాయం చేయలేదని రియలైజ్ అయ్యి.. దానికి కారణం తన బాడీ అని అనుకుని బాధపడ్డారట.

jrntr

అందుకే ఎలాగైనా సరే బరువు తగ్గాలని విపరీతంగా వర్కవుట్లు చేశారు. సరిగ్గా డైరెక్టర్ రాజమౌళి యమదొంగ సినిమా కోసం ఎన్టీఆర్ ని అప్రొచ్ అయినప్పుడు.. ఎన్టీఆర్ ని చూసిన రాజమౌళి మీరు చాలా చండాలంగా ఉన్నారు తారక్ గారు అని మోహం మీదే అనేశారట. సగం మంది ఆడియన్స్ అయితే మీ మూవీస్ చూడటమే మానేశారని అన్నారట. మీరు ఇంత లావుగా ఉంటే యూత్ అబ్బాయిలు గానీ, అమ్మాయిలు గానీ మీ సినిమాలు చూడడం, పట్టించుకోవడం మానేశారని అన్నారట. అయితే ఈ మాటలకు చాలా డీప్ గా హర్ట్ అయిన ఎన్టీఆర్ వెంటనే బాడీ షేపింగ్ మెకానిజం లైపో సెక్షన్ చేయించుకుని ఆ తర్వాత బాడీని కరెక్ట్ షేప్ కి తీసుకొచ్చి.. అప్పట్నుండి అదే బాడీని మెయింటైన్ చేస్తున్నారు.

 

అలా యమదొంగ సినిమా టైమ్ లో రాజమౌళి, ఎన్టీఆర్ ను మొహం మీద అలా అనేసరికి తన బాడీని మార్చుకున్నారు. ఏది ఏమైనా తన మంచి కోరే ఓ ఆత్మీయుడిగా రాజమౌళి చెప్పగానే తన భవిష్యత్ కోసం ఆలోచించిన ఎన్టీఆర్ వీరి కాంబోలో వచ్చిన యమదొంగ మూవీ ఓ రేంజ్ లో హిట్టయ్యింది. ఇక రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ కూడా సూపర్ సక్సెస్ అయ్యి.. తారక్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...